పీకే సర్వే: ‘ఫ్యాన్’ చిత్తు..స్టోరీ!

రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నాయి…కానీ ఇప్పటినుంచే వైసీపీ-టీడీపీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ-ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అలాగే ఎవరికి వారు సెపరేట్ గా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు…ఎక్కడ ఎంత బలం ఉందనే అంశంపై సర్వేలు నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీం..వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మధ్య పీకే టీం సర్వే చేసి…ఆ వివరాలని జగన్ కు ఇచ్చిందట…అందులో ఊహించని ఫలితాలు చూసి జగన్ షాక్ అయ్యారట..అలాగే బాగా ఆగ్రహం కూడా వ్యక్తం చూసారట. మరి అంతలా సర్వేలో ఏముందా? అంటే అందులో కేవలం వైసీపీ 35 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని తేలిందట. ఇదే పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్ట్ లో ఉందని చెప్పి…టీడీపీ అనుకూల మీడియా ఓ పెద్ద స్టోరీ చెప్పుకొచ్చింది.

అసలు పీకే సర్వే గురించి వైసీపీ వాళ్ళకైనా తెలిసిందో లేదో తెలియదు గాని…ఆ టీడీపీ అనుకూల మీడియాకు మాత్రం తెలిసిపోయిందట…తమకు ఉన్న సీక్రెట్ సోర్సెస్ ద్వారా పీకే టీం సర్వే వివరాలు తెలిసాయని టీడీపీ అనుకూల మీడియా చెబుతుంది. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. అసలు ఎంతో సీక్రెట్ గా ఉండే సర్వే వివరాలు టీడీపీ అనుకూల మీడియా చేతిలోకి ఎలా వస్తాయి. అదేవిధంగా వైసీపీకి 35 సీట్లు మాత్రమే అంటే నమ్మడానికి వీలు లేకుండా ఉంది.

ఇటీవల వస్తున్న కొన్ని న్యూట్రల్ సర్వేల్లోనే వైసీపీకి 80 పైనే సీట్లు వస్తాయని చెబుతున్నారు..అలాగే కొన్ని చోట్ల గట్టి పోటీ ఉందని అంటున్నారు. మరి ఇలా సర్వేలు బయటకొస్తుంటే….పీకే సర్వేలో మాత్రం 35 అని టీడీపీ అనుకూల మీడియా ఓ సూపర్ స్టోరీని అల్లేసింది. దీని వల్ల వైసీపీ కేడర్ ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. అయినా టీడీపీ అనుకూల మీడియా స్టోరీలు నమ్మడం కష్టమే.