ఎన్టీఆర్ ఫ్యాన్సూ మీరు కాల‌ర్ ఎగ‌రేసే న్యూస్ ఇది…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ పుట్టుకొస్తుంది. ఆయన పేరుతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక తాతకు తగ్గ మనవడిగా తాత పేరును నిలబెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈయన నటన గురించి చెప్పాలి అంటే ఆర్ ఆర్ ఆర్ కి ముందు, ఆ తరువాత అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ,రాంచరణ్ మల్టీ స్టారర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . ఈ చిత్రం కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకులు లేడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అభిమాని కూడా ఎన్టీఆర్ నటనను పొగుడుతున్నారు.NTR In Oscar Race: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..? - 10TV Telugu

అంతేకాదు రౌద్రం, బీభత్సం, ప్రేమ , కరుణ ఒకే పాత్రలో చూపించి ఇండియాలోనే ది బెస్ట్ నటుడు అని అనిపించుకున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉండగా ఈయన నటనకు గాను ఎన్టీఆర్ కి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బరిలో ఉత్తమ నటుడు క్యాటగిరిలో ఎన్టీఆర్ ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ప్రముఖ మూవీ పబ్లికేషన్ వెరైటీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇకపోతే ఆస్కార్ 2023 నామినేషన్ లో ఎన్టీఆర్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.RRR' star Jr NTR possible contender for Oscars? Read more | Regional News |  Zee News

తెలుగు ఇండస్ట్రీ నుంచీ ఆస్కార్ కు ఎంపిక అయిన హీరో NTR అని తెలిసి.. అభిమానులు కాలర్ ఎగరెస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచీ ఆస్కార్ కు ఎంపికైన హీరో NTR ఒక్కరే అవుతారు.అది నిజంగా తెలుగు ఇండస్ట్రీ కి గర్వకారణమైన విషయం అని చెప్పవచ్చు.మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

Share post:

Latest