వావ్: ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి మల్టీస్టారర్..? నందమూరి హీరో ఆసక్తికర సమాధానం..!?

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం బింబిసార.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.. ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు.. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు. ట్రైలర్ లో చూపించింది కొంతే అని, థియేటర్లలో ప్రేక్షకులు చాలా సప్రైజ్ అవుతారని చెప్పారు. బింబిసార సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అన్నారు..

రొమాన్స్ తక్కువే..

బింబిసార రొమాంటిక్ సినిమా కాదన్నారు. ఈ సినిమాలో బింబిసార పాత్రకు రొమాన్స్ తక్కువగా ఉంటుందని తెలిపారు. తనకు రొమాంటిక్ సినిమాలు కలిసిరాలేదన్నారు. రొమాంటిక్ సినిమాలు చేసి తన కెరీర్ లో చేదు అనుభవాలను చవిచూశానని అన్నారు. రొమాంటిక్ సినిమాలు చేయనని, తన బాడీకి అలాంటి సినిమాలు సెట్ కావని అన్నారు.

మల్టీస్టారర్ కి చాలా కసరత్తు చేయాలి..

ఇక ఎన్టీఆర్, బాలకృష్ణ మల్టీస్టారర్ గురించి ఆసక్తికర సమాధానం చెప్పారు. వారితో మల్టీస్టారర్ చేయాలంటే చాలా కసరత్తు చేయాలని, అది అంత ఈజీ కాదని అన్నారు. మల్టీస్టారర్ సినిమా చేయాలంటే ఏళ్లు పడుతుందన్నారు. కథ, నటీనటులు దొరికితేనే సాధ్యమవుతుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ తో సినిమా తీయాలంటే చాలా ప్రెజర్:

ఎన్టీఆర్ తో సినిమా తీయాలంటే చాలా ప్రెజర్ ఉంటుందని, ఆయన ప్రస్తుతం ఓ పాన్ ఇండియా స్టార్ అనికళ్యాణ్ రామ్ అన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తారక్ తో సినిమా ప్రకటించామన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తారక్ భాగస్వామిగా మారడమేంటని ప్రశ్నించారు. అసలు ఈ బ్యానరే తమ కుటుంబానిదని స్పష్టం చేశారు. తమ మధ్య బిజినెస్ లావాదేవీలే లేవన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తారక్ భాగస్వామి అవుతాడనడంలో అర్థం లేదని కళ్యాణ్ రామ్ చెప్పారు.

Share post:

Latest