చేతిలో రూపాయి లేదు.. లాక్ డౌన్ లో దుర్భర పరిస్థితి..చార్మీ ఎమోషనల్ ..!!

ప్రముఖ నటి ఛార్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటిగా వెండితెరపై తనను ప్రూవ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. దానిని కంటిన్యూ చేయడం మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ విషయం చాలా కఠినంగా ఉంటుంది. పెళ్లికి ముందు ఒకలాగా.. పెళ్లికి తర్వాత ఒకలాగా అని చెప్పవచ్చు. ఇక పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు, భర్త, పిల్లలు ఇవే సరిపోతాయి.కానీ వారి కెరియర్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. ఇకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కంటిన్యూ అవ్వడమే కాకుండా ముంబై ని వదిలి హైదరాబాదునే తన హోమ్ టౌన్ గా మార్చుకున్న నటి ఛార్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం నిర్మాతగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.Charmy Kaur Bio, Movies, Height, Weight, Husband Name, Age & Image - info  Knocks

ఇకపోతే తాజాగా లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ను, పూరి జగన్నాథ్ ను.. చార్మి ఇంటర్వ్యూ చేశారు . దీనికి సంబంధించిన ప్రోమోను శుక్రవారం విడుదల చేస్తామని వెల్లడించడం జరిగింది. ఇకపోతే ఇందులో ఆసక్తికర అంశాలకు కొదవ లేనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ తో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోవడం తెలిసిందే. ఇకపోతే సినిమా గురించి చాలా ప్రశ్నల్ని సూటిగా, నిర్మొహమాటంగా అడిగిన ఛార్మీ ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుందని చెప్పాలి. ఇకపోతే తాను అడిగిన ప్రశ్నలు తనవి కావని సోషల్ మీడియాలో అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నలుగా ఆమె వెల్లడించారు. ఇక అంతే కాదు ఒకవైపు ప్రశ్నలు అడుగుతూనే మరొకవైపు తన వ్యక్తిగత విషయాలను గురించి కూడా చెబుతూ ఎమోషనల్ అయింది.Buzz: Charmme Left Acting To Enjoy Ageing

లాక్ డౌన్ సమయంలో తన జేబులో ఒక రూపాయి కూడా లేదంటూ ఎమోషనల్ అయిన ఈమె.. అలాంటి సమయంలో తన సినిమాను అమ్మడానికి ఓటిటీ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని ..అంత పెద్ద ఆఫర్ ను రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలన్న ఆమె మాటలు విని ఒక్కసారిగా విజయ్ ,పూరీ చూస్తుండిపోయారు. ఇక పూరీ కల్పించుకొని నీ కష్టాలు అర్థం అవుతున్నాయి.. ఎన్నిసార్లు ఏడ్చి ఉంటావు అంటూ సాంత్వన పలికే ప్రయత్నం చేశారు.ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.

Share post:

Latest