పవన్ పాలిటిక్స్…నో క్లారిటీ?

పవన్ కల్యాణ్ చేసే రాజకీయంపై ఏ మాత్రం క్లారిటీ ఉండటం లేదు…అసలు ఆయన జనసేన బలోపేతం కోసం పనిచేస్తున్నారా? లేక టీడీపీని గెలిపించడం కోసం పనిచేస్తున్నారా? అనేది తెలియడం లేదు. మొదట నుంచి పవన్…టీడీపీకి అనుకూలమైన రాజకీయాలే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు…టీడీపీ చేసే తప్పులని పెద్దగా ప్రశ్నించరు. ఇక వైసీపీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. అధికారంలోకి వచ్చాక మరింత ఎక్కువ గా జగన్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఈ స్థాయిలో పవన్ ఎప్పుడు చంద్రబాబుని విమర్శించలేదు.

అసలు ఆ పార్టీలోని కొందరు నేతలని విమర్శించారు తప్ప…డైరక్ట్ గా బాబుపై విమర్శలు చేసిన సందర్భాలు లేవు. అందుకే ఏపీలో జనసేన పార్టీ బలోపేతం కావడం లేదని చెప్పొచ్చు. పవన్ ఎప్పుడైనా తమ పార్టీ కోసం రాజకీయాలు చేస్తే బాగానే ఉంటుంది…కానీ ఆయన ఎప్పుడు టీడీపీ కోసమే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పవన్ ఏదో రకంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని విమర్శించడం తప్పు లేదు…కానీ అదే సమయంలో ప్రతిపక్షంగా టీడీపీ విఫలమవుతున్న విషయంపై కూడా మాట్లాడాలి.

అది మాత్రం పవన్ చేయరు..టీడీపీ ఎలాంటి విమర్శలు చేయరు..పైగా జనసేనకు అధికారం ఇవ్వాలని, మార్పు చేసి చూపిస్తానని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పి..టీడీపీతో పొత్తుకు రెడీగా ఉన్నానని చెబుతారు. అంటే టోటల్ గా పవన్..ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అంటే ప్రజలని జనసేన వైపుకు రమ్మంటున్నారా? లేక టీడీపీకి మద్ధతు ఇవ్వమంటున్నారా? అనేది తెలియడం లేదు. ఏ మాత్రం క్లారిటీ లేకుండా పవన్ రాజకీయం చేస్తున్నారు. ఇలాగే ముందుకెళితే భవిష్యత్ లో ప్రజలు జనసేనని ఆదరించే పరిస్తితి ఉండదు. అలాగే పవన్ సీఎం కూడా కాలేరు. ఇక ఎంతసేపు బాబుని సీఎం చేయడానికే పవన్ కష్టపడేలా ఉన్నారు.

Share post:

Latest