చీరాలలో కొత్త ట్విస్ట్..?

2014 ఎన్నికల నుంచి చీరాల నియోజకవర్గంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి..అసలు ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో..ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్…2014 ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. వ్యక్తిగత ఇమేజ్ తోనే ఆమంచి గెలిచారు. అప్పుడు టీడీపీ నుంచి పోతుల సునీత పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో…ఆమంచి టీడీపీలోకి వచ్చారు.

దీంతో ఆమంచి, పోతుల వర్గాలకు పడని పరిస్తితి…సరే అలా అలా రాజకీయం నడిచిపోయింది…అధికారం ఉన్నన్ని రోజులు ఆమంచికి హవా నడిచింది…ఇక 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా రాజకీయంగా మారడంతో ఆమంచి టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వెళ్లారు. అయితే 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన యడం బాలాజీ…ఆ ఐదేళ్లు పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసిన సరే జగన్ మాత్రం…ఆమంచికి సీటు ఇచ్చారు. దీంతో 2019 వైసీపీ తరుపున ఆమంచి బరిలో దిగారు. దీంతో యడం టీడీపీలోకి వచ్చేశారు.

అయితే చీరాలలో టీడీపీ నుంచి సీనియర్ నేత కరణం బలరాం పోటీ చేశారు. అనూహ్యంగా ఆమంచిపై కరణం మంచి మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చింది..దీంతో కరణం టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. దీంతో ముగ్గురు ప్రత్యర్ధులు ఒకే పార్టీలోకి వచ్చారు. అక్కడ నుంచి చీరాల వైసీపీలో రచ్చ నడుస్తూనే ఉంది.

ఇటు కరణం వెళ్లిపోయాక టీడీపీ ఇంచార్జ్ పదవి యడంకు దక్కింది. కానీ ఆయన సరిగా పనిచేయలేదు. దీంతో యడంని పక్కన పెట్టి ఎం‌ఎం కొండయ్యని ఇంచార్జ్ గా పెట్టారు. ఇలా చీరాలలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు నడుస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. అదే సమయంలో టీడీపీతో పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు దక్కవచ్చని ప్రచారం జరుగుతుంది. అప్పుడు జనసేన నుంచి యడం బాలాజీ పోటీ చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి చీరాల రాజకీయం అనేక మలుపులు తిరుగుతుంది.

Share post:

Latest