Netflix రాజమౌళిని హర్ట్ చేసిందా? విషయం ఇదే!

రాజమౌళి అనే పేరు కీర్తి గడించింది. ఎక్కడో సీరియల్స్ నుండి మొదలైన అతని ప్రస్థానం నేడు విశ్వవ్యాప్తం అయ్యింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ అతగాడి పేరుని జపం చేస్తున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవాలి. జక్కన్న తాజా సినిమా RRR ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. 1920 నేపథ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం ఇద్దరు పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు కొమురం భీం ల పీరియాడిక్ ఫాంటసీ కథగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామి సృష్టించింది.

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఐదు భాషల్లో ఈ మూవీ రూ. 1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ హిందీ వెర్షన్ మే 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక దక్షిణాది భాషలకు సంబంధించి జీ5 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ ని నెటఫ్లిక్స్ లో వీక్షిస్తున్న హాలీవుడ్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. విదేశీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ విషయంలో జక్కన్న హర్ట్ అయ్యారట.

కారణం తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ OTT హక్కుల్లో కేవలం హిందీ వెర్షన్ హక్కుల్ని మాత్రమే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మిగతా భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని జీ5 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నాయి. ఇదే తనకు నచ్చలేదని రాజమౌళి తాజాగా స్పందించాడు. నెట్ ఫ్లిక్స్ లో RRR 10 వారాల పాటు ట్రెండ్ అయిన మాట తెలిసినదే. మిగగా భాషల రైట్స్ కూడా తీసుకొనుంటే సినిమా ఇంకా బాగా వెళ్లేదని అతను అభిప్రాయపడ్డారు.