టాలీవుడ్ లో బాలకృష్ణ , మహేష్ బాబు ధైర్యం ఎవరికీ లేదా?

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతల మధ్య ఒకింత అసహన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. కరోనా తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో తెలుగు పరిశ్రమ కూడా కుదేలు అయ్యింది. ఇక కరోనా అనంతరం సినిమాలు విడుదల అవుతున్నా అంతంత మాత్రమే నడుస్తుంది. దాంతో సినిమా నిర్మాణ ఖర్చుల భారం తగ్గించే దిశగా ‘నిర్మాతల గిల్డ్’ సినిమా షూటింగులను బంద్ చేసారు. అయితే సమస్య సినిమా షూటింగులను బంద్ చేస్తే తీరిపోతాయా అన్నదే ప్రశ్నగా మారింది. ఏకపక్షంగా తీసుకున్న సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం మీద అన్నివైపుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక హీరోలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సమస్య తీరుతుంది అని భావిస్తే అది తప్పు అంటూ సినిమా పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి తరుణంలో ఈ ఇష్యూ మీద నట్టి కుమార్ స్పందించారు. ఆగష్టు 15 తర్వాత నుండి ఎవరు ఏమి చేసినా మా షూటింగులు మొదలవుతాయి అంటూ బాలకృష్ణ, మహేష్ బాబు ప్రకటించడంతో ఇపుడు ఇండస్ట్రీలో ఏమి జరుగుతోంది అనే అంశాలపై నట్టి కుమార్ స్పందించడం జరిగింది. షూటింగుల బంద్ వల్ల నష్టం కార్మికులకు చిన్న సినిమా నిర్మాతలకే కానీ మిగతా వాళ్లమీద పెద్దగా ప్రభావం చూపదు అని అన్నారు.

ఇక ఇన్నిరోజులు షూటింగులు బంద్ చేసి గిల్డ్ నిర్మాతలు మాత్రం సాధించేది ఏమిటని ప్రశ్నించారు. ఒక్క సమస్యకైనా వారికి పరిష్కారం దొరికిందా? ఎవరి దగ్గరికి వెళ్లి చర్చించారు అంటూ నట్టి కుమార్ ఫైర్ అయ్యాడు. పెద్ద హీరోలకు షూటింగుల బంద్ వల్ల నష్టమేమి లేదని, అంతా కార్మికులే నష్టపోతారని వాపోయారు. ఇక రోజూ ఇండస్ట్రీ ని నమ్ముకుని పని చేస్తున్న కార్మికులు మాత్రమే నష్టపోతున్నారు అంతే అని కామెంట్స్ చేసారు. ఇంకా మాట్లాడుతూ.. ఇక మా షూటింగ్ ఆగష్టు 15 తర్వాత ప్రారంభిస్తున్నాం అంటూ ఇప్పటికే బాలకృష్ణ, మహేష్ బాబు ప్రకటించేసారు. ఈ విషయంలో మిగతా పెద్ద హీరోలు ఎందుకు మౌనంగా వున్నారో అర్ధం కావడం లేదని అనుమానం వ్యక్తం చేసారు.

Share post:

Latest