నాగచైతన్య పట్టుబడ్డాడు… ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు?

అక్కినేని కుటుంబం నుంచి మొదటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య అనతికాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ జనాలను మాయ చేసాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత మాయలో పది కెరీర్‌ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. దాంతో అక్కినేని అభిమాన లోకం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

ఇక ఆ తర్వాత జరిగిన తంతు అందరికీ తెలిసినదే. వీరు విడిపోయి దాదాపు సంవత్సరం కావస్తున్నా జనాలు మాత్రం వీరిని వదలడం లేదు. వారు విడిపోవడానికి గల కారణాలు చెప్పాలని సమయం వచ్చినప్పుడల్లా మీడియా వారిని ప్రశ్నిస్తూనే వుంది. అయితే విడాకుల అనంతరం ఓ వర్గం వారు సమంతని ఎక్కువగా ట్రోల్స్ చేయడం మనకు తెలిసినదే. కాగా ఇపుడు తప్పు సమంతది కాదని, వారి ఎడబాటుకి అసలు కారకుడు నాగ చతన్యే అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు.

విడిపోయిన తరువాత ఇద్దరూ ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీగా మారిపోయారు. సమంత తన సినిమా లైఫ్‌ను బిందాస్‌గా ఎంజాయ్ చేస్తోంది. బాలీవుడ్, కోలివుడ్, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుస బెట్టి సినిమాలు చేస్తూ దుమ్మురేపుతోంది. ఓ రకంగా చైతూ సినిమాల విషయంలో కాస్త నెమ్మదించాడనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల రిలీజైన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. కాగా ఈ సినిమాల ఇంటర్వ్యూలో భాగంగా సదరు యాంకర్ అడిగి ప్రశ్నకు చే బదులిస్తూ.. నేను నా గర్లఫ్రెండ్ చేసిన పనికి ఓసారి పోలీసులు పట్టుకున్నారని చెప్పుకొచ్చాడు. తాను హైదరాబాద్‌లోని ఓసారి ఆపి ఉన్న కారులో చైతన్య, తన ప్రేమికురాలు క్లో‌జ్ గా వున్న టైంలో పోలీసులు వచ్చి నానా రాద్ధాంతం చేశారట. ఆ తరువాత అలాంటి చిలిపి పనులు చేయలేదని చెప్పుకొచ్చాడు.

Share post:

Latest