మునుగోడు మూడు ముక్కలాట..!

మునుగోడుని కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఎలాగైనా మునుగోడు ఉపఎన్నికలో గెలిచి తీరాలని, ఇది కూడా గెలవకపోతే…నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనస్ అవుతుందని అధికార టీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోయి, కాస్త బలహీనపడింది…ఇప్పుడు మునుగోడులో కూడా ఓడిపోతే అంతే సంగతులు..అందుకే ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. అలాగే అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లే.

అయితే కూసుకుంట్లని టీఆర్ఎస్ లోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, సర్పంచ్ లు కొందరు…కూసుకుంట్లకు టికెట్ ఇస్తే…తామే ఓడిస్తామని అంటున్నారు. అధిష్టానం ఎంత బుజ్జగించిన వారు వినడం లేదు. కానీ అధిష్టానం మాత్రం కూసుకుంట్ల వైపే ఉంది. ఇటు సిట్టింగ్ సీటుని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది…ఇప్పటివరకు జరిగిన అన్నీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఓడిపోతే..ఇంకా పార్టీ పరిస్తితి మరింత దిగజారుతుంది…అందుకే ఎలాగైనా మునుగోడులో గెలిచి తీరాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు.

అలాగే కాంగ్రెస్ తరుపున చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఆర్ధిక, అంగ బలం ఎక్కువ ఉన్న కృష్ణారెడ్డి వైపే కాంగ్రెస్ మొగ్గు చూపుతుంది. ఇక ఇంతవరకు మునుగోడులో కనీసం రెండోస్థానంలోకి కూడా రాని బీజేపీ వచ్చి…దూకుడుగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ బలపడుతుంది. పైగా బలమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం పెద్ద ప్లస్. కేవలం కోమటిరెడ్డి బలం మీద బీజేపీ గెలుపు ఆధారపడి ఉంది. అదే సమయంలో కేంద్రం పెద్దలు…మునుగోడుపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. అలాగే వారి సపోర్ట్ కోమటిరెడ్డికి ఫుల్ ఉంది.

ఇప్పటికే బండి సంజయ్…మునుగోడులో పాదయాత్ర చేస్తున్నారు…అలాగే రాష్ట్ర నేతలంతా మునుగోడుపై ఫోకస్ పెట్టారు. ఎలాగైనా మునుగోడు కూడా గెలిచి…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేది తామే అని రుజువు చేసుకోవాలని చూస్తున్నారు. మొత్తానికైతే మునుగోడులో మూడు ముక్కలాట నడుస్తోంది…మరి ఈ ఆటలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Share post:

Latest