మునుగోడు పోరు: ఆ పార్టీదే లీడ్?

తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోరు హాట్ హాట్ గా సాగుతుంది..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో…అనూహ్యంగా మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంకా షెడ్యూల్ రాకముందే…మూడు ప్రధాన పార్టీలు మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు హోరాహోరీగా మునుగోడులో రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేసి…తమ తమ పార్టీలని గెలిపించుకునేదుకు కష్టపడుతున్నారు.

ఇక ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది…అటు టీఆర్ఎస్ తరుపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉండగా, కాంగ్రెస్ నుంచి చల్లమల్ల కృష్ణా రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడగానే…మునుగోడులో కాంగ్రెస్ నేతలు భారీ సభ పెట్టారు. తాజాగా టీఆర్ఎస్ సైతం భారీ సభ పెట్టగా, కేసీఆర్ హాజరై…బీజేపీపై ఫైర్ అయ్యారు…ఆ వెంటనే బీజేపీ భారీ సభ పెట్టనుంది…ఈ సభకు అమిత్ షా హాజరు కానున్నారు. ఇలా మూడు పార్టీలు మునుగోడులో హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఇక మునుగోడు ఉపఎన్నిక విషయంలో సర్వేలు కూడా నడుస్తున్నాయి…ఇప్పటికే పలు సంస్థలు మునుగోడులో దిగి సర్వేలు చేస్తున్నాయి. అయితే హోరాహోరీ పోరులో ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ వచ్చేలా లేదు. ఎందుకంటే రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. బలబలాలు ఊహించని విధంగా మారుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ..కానీ కోమటిరెడ్డి జంప్ అవ్వడంతో ఆ పార్టీ బలం తగ్గింది…ఇక ఎంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఉంటారో తెలియడం లేదు.

అటు మునుగోడులో బీజేపీకి బలం తక్కువ…కోమటిరెడ్డి బలం, కాంగ్రెస్ నుంచి కార్యకర్తల బలం, అలాగే టీఆర్ఎస్ నుంచి సైతం కొందరిని లాగుతున్నారు. ఇక వారి బలంపైనే బీజేపీ గెలుపు ఆధారపడి ఉంది. ఇక్కడ 2014 ముందు వరకు టీఆర్ఎస్స్ పార్టీకి బలం లేదు…2014 నుంచి బలం పెరిగింది…ఆ పార్టీకి కార్యకర్తల బలం ఎక్కువే. పైగా బలమైన కమ్యూనిస్టులు మద్ధతు ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్-బీజేపీల మధ్య ఓట్లు చీలితే టీఆర్ఎస్ పార్టీకే బెనిఫిట్. ప్రస్తుతానికి చూసుకుంటే మునుగోడులో టీఆర్ఎస్ కాస్త లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.