సినిమాలు ఓకే.. మరి సీరియల్ నటీ నటుల పారిపోషికం ఎంతో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అయినా సరే బుల్లితెర ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయం.. సగటు ప్రేక్షకులు తెలుసుకోవాలి అంటే ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు.. ఇక సినిమాలు సీరియల్స్ ద్వారానే కాకుండా ఇతర వ్యాపారాల ద్వారా ఎంత సంపాదిస్తున్నారు.. వారి ఆస్తి ఎంత.. ఇలా ప్రతి విషయాలను తెలుసుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. అయితే వారితోషకం విషయంలో మాత్రం సెలబ్రిటీలు ఏ రోజు కూడా నోరు మెదపరు అని చెప్పాలి. ఎంతో కొంత ఇస్తున్నారు అంటూ చెప్పడం లేదా ఎగ్జాంపుల్ తరహాలో చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు.TV Actor Amardeep Chowdary And Tejaswini Gowda Engagement Video Viralఇకపోతే రెమ్యూనరేషన్ విషయంలో ఎంతో సీక్రెట్ మైంటైన్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీలు. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడాలు ఉంటాయి. సీరియల్స్ కి ఒకలా.. షోలకి ఒకలా.. స్పెషల్ ఈవెంట్లకి ఒకలా.. సాంగ్స్ కి, ప్రత్యేక పాత్రలకు, సినిమాలకు ఒక్కొక్క విభాగాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పారితోషకం అందిస్తూ ఉంటారు. ఇక పారితోషకం విషయంలో ఎవరు కూడా అంతా సులభంగా బయటపడరు అని చెప్పాలి. కానీ ఈ విషయంపై ప్రముఖ సీరియల్ యాక్టర్ అమర్దీప్ మాత్రం ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్టు మీడియాతో వెల్లడించాడు.TV Actor Amardeep Chowdary And Tejaswini Gowda Engagement Video Viral

జానకి కలగలేదు అనే సీరియల్ ద్వారా రామచంద్రగా, రామాగా , అమరదీప్ అద్భుతంగా నటించేస్తున్నాడు ఇక నిజంగా సుగుణాల రాముడే అన్నట్టుగా అమర్దీప్ కనిపిస్తాడు. ఇక ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ఈయన కోయిలమ్మ, కేరాఫ్ అనసూయ సీరియల్ లతో తెలుగులో బాగా ఫేమస్ అయిన నటి తేజస్విని గౌడను ప్రేమించి, వివాహం చేసుకోబోతున్నారు ఇక ఈ క్రమంలోని వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక ఈ విషయాలన్నీ కూడా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిమానులతో పంచుకోవడం గమనార్హం.Amardeep Chowdary Wiki, Biography, Age, Movies, Images - News Bugz

ఇకపోతే ఇంటర్వ్యూ లో భాగంగా పారితోషక విషయం గురించి చెప్పుకొచ్చాడు. మొదట్లో తనకు సీరియల్ కోసం పని చేసినప్పుడు నెలకు రూ.25,000 ఇచ్చారట మొదటి చెక్కు మాత్రం శైలజ రెడ్డి అల్లుడు అనే సినిమా కోసం అందుకున్నాడట అమరదీప్. ఇక రెండు రోజులు షూటింగ్ చేశాడట. ఒక్క రోజుకు రూ.7,500 ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే ఆ రెండు సీన్లు కూడా ఎడిటింగ్ లో పోయాయట.. మరి సిరిసిరిమువ్వ సీరియల్ కి నెలకు రూ.80,000 తీసుకున్నారట. ఇక ఇదే తరహాలో చాలామంది సీరియల్ నటుల పారితోషికం ఉంటుంది అని .. అయితే సినిమాల రేంజ్ లో తీసుకునే అవకాశం అయితే లేదు అని ఆయన స్పష్టం చేశారు.