జ‌గ‌న్ చేతిలో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్‌… వాళ్ల ఎవ‌రంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్‌గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్ష టిడిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వాతావరణమే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే నివేదిక ఇప్పటికీ జగన్ వద్దకు చేరినట్టుగా తెలుస్తోంది.

ఈ సర్వేలో పలు షాకింగ్ విషయాలు కూడా ఉన్నాయని వైసిపి వర్గాల్లో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మొత్తం జగన్ కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టిడిపి – జనసేన నుంచి గెలిచిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా వైసీపీకే మద్దతు ఇస్తున్నారు. ఈ 155 మంది ఎమ్మెల్యేలలో 25 మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా ఓడిపోతారన్న నివేదిక జగన్‌కు అందినట్టు వైసిపి వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం

.

ఈ విషయమై ఆ ఎమ్మెల్యేలను పిలిపించి స్వయంగా మాట్లాడాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకతకు కారణాలు ఏమిటో కూడా వారికి నేరుగా జగన్ చెప్పనున్నారట. చాలామంది ఎమ్మెల్యేలు గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. మరికొందరు ఎమ్మెల్యేలు కరోనా తర్వాత కూడా ప్రజల వద్దకు వెళ్లలేదు.

మరికొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రజలకు పార్టీ కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ఈ 25 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసిందట. జగన్ వీళ్ళ పనితీరు మారకపోతే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వీరిని పక్కన పెట్టేసి ఆయా స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చేలా కఠిన నిర్ణయం తీసుకోనున్నారట.