పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ఎవరు ఊహించిన విధంగా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పూరి సినిమాలలో ఇది చాలా చెత్త సినిమా అని.. పూరి ఈ సినిమా ఎందుకు తీశాడంటూ సోషల్ మీడియా వేదిక నేటిజన్లు పూరీపై చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాని పలువురు హీరోలు రిజెక్ట్ చేశారు. వారెవరో మనం ఇప్పుడు చూద్దాం.
పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కంటే ముందు ఈ కథను పలువురు స్టార్ హీరోలకు చెప్పాడు.
పూరీ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడు. పూరీ జూనియర్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి మొదటగా ఆంధ్రావాలా సినిమా వచ్చింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. తరవాత టెంపర్ సినిమా వచ్చింది. ఈ సినిమా పూరీకి ఎన్టీఆర్ అదిరిపోయే సక్సెస్ ని తీసుకువచ్చింది. అయితే లైగర్ కథ ఎన్టీఆర్కు నచ్చకపోవటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
తర్వాత పూరీ ఈ కథతో రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకున్నాడు. రామ్ చరణ్ మొదటి సినిమా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చింది. అచనువుతో పూరీ రామ్ చరణ్ కు లైగర్ కథ చెప్పారు కొన్ని అనుకోని కారణాలవల్ల చరణ్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా ప్రమోషన్ లో ఈ సినిమా కథ ముందుగా బన్నీ వల్లే స్టార్ట్ అయిందని చెప్పాడు. పూరీ జగన్నాథ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో దేశముదురు సినిమా వచ్చింది.
ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు. ఈ క్రమంలోనే బన్నీకి కూడా పూరి లైగర్ కథ అని చెప్పాడు. బన్నీ కూడా ఈ కథలో యాక్షన్ మరి విపరీతంగా ఉందని కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. ఇలా పూరీ లైగర్ కథను ముగ్గురు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారు. ఈ హీరోల అభిమానులు ఈ సినిమా చేయకపోవడంతో చాలా మంచి పని అయిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.