యంగ్ హీరోయిన్ తో కలిసి తాగి, తందానాలు ఆడిన బడా నిర్మాత!

ఆ బడా నిర్మాత మరెవరో కాదు కరణ్ జోహార్. అవును.. కాఫీ విత్ కరణ్ 7 వరుస ఎపిసోడ్స్ తో కరణ్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. ఇతడి షోలు అక్కడి సినిమాలకంటే కూడా బాగా ఆడుతున్నాయి. ఇక ఆ షో సంగతి అందరికీ తెలిసిందే. అందులో పార్టిసిపేట్ చేసిన సెలిబ్రిటీల నుండి కరణ్ ఎంతో చాకచక్యంగా రహస్యాలను రాబడతాడు. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతగాడు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈసారి సిద్ధార్థ్ మల్హోత్రా – విక్కీ కౌశల్ షోలో కరణ్ ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్.

అవును.. కాఫీ విత్ కరణ్ 7 తాజా ఎపిసోడ్ లో హోస్ట్ కరణ్ జోహార్ విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ ల వైవాహిక జీవితంతో పాటు.. సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీల భవిష్యత్తు గురించి ప్రశ్నలు గుప్పించాడు. తాజాగా విక్కీ కౌశల్ – సిద్ధార్థ్ మల్హోత్రా జోడీ తో ప్రోమో విడుదల అవ్వగా కరణ్ ఊహించని సర్ ప్రైజ్ థింగ్ ని ఆడియెన్ కి రివీల్ చేశారు. అదేమంటే కరణ్ – అలియా భట్ ఓ సందర్భంలో బాగా తాగి విక్కీ కౌశల్ (కత్రినతో పెళ్లికి ముందు) కి డయల్ చేసామని వెల్లడించాడు. తాగి కాల్ చేసిన సంఘటన గురించి వారు ఈ విధంగా మాట్లాడారు.

“మేమిద్దరం ఓసారి తప్పతాగి విక్కీకి డయల్ చేసాము. మత్తులో మాకు చుక్కలు కనిపిస్తున్నాయి. మేం పార్టీకి ఇంకా ఎవరిని పిలవాలా? అని ఆలోచిస్తున్నాం! విక్కీకి కాల్ చేశాం. అతడు కత్రినను పెళ్లాడక ముందు ఘటన ఇది” అని కరణ్ జోహార్ నిజాయితీగా గుర్తు చేసుకున్నాడు. ఇంకా అతగాడు మాట్లాడుతూ… “మా ఇద్దరికీ కత్రినా చాలా కాలంగా క్లోజ్. మేం విక్కీతో కత్రినను చూశాం. ఆ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోవడం మమ్మల్ని చాలా ఎమోషనల్ గా హ్యాపీగా మార్చింది” అన్నారాయన. విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్ 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వేడుకగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Share post:

Latest