ఉదయ్ కిరణ్ తో చిరంజీవి కూతురు సుస్మిత పెళ్లి ఇందుకే జరగలేదట… పవన్ కారణమని అన్నారు?

తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవిలాగా ఓ స్టార్ హీరోగా ఎదిగిన ఆర్టిస్ట్ ఉదయ్ కిరణ్. అయితే అతగాడు ఎంత త్వరగా స్టార్ డంని సంపాదించాడో అంతే త్వరగా ఆ స్టార్డమ్ ను కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంగతి అందరికీ తెలిసినదే. నాడు తెలుగు పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సిన వాడు చివరికి సినిమాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్తలు అప్పట్లో కధలు కధలుగా వచ్చాయి.

వాస్తవానికైతే ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఉదయ్ కిరణ్ ను అల్లుడిని చేసుకోవాలని చిరు అనుకున్నాడు, ఎంగేజ్మెంట్ కూడా జరిగాక ఎందుకు క్యాన్సిల్ అయిందో ఎవరికీ పెద్దగా కారణాలు తెలియకపోయినా ఆనాడు పలురకాల పుకార్లు మాత్రం బాగా వినిపించేవి. చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత కు ఉదయ్ కిరణ్ కు నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిజానికి ఉదయ్ కిరణ్ కి చిరు అంటే చాలా ఇష్టం, తన అభిమాన హీరోకి అల్లుడు అవ్వడం.. ఇంక అంతకన్నా ఇంకేం కావాలి అనుకున్నాడు.

కానీ ఉదయ్ కిరణ్ టాప్ హీరో. అయితే చిరు రేంజ్ మాత్రం కాదు. తన కూతురుని ఒక మంచి స్టేటస్ ఉన్న ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరైనా భావిస్తారు అలానే చిరు కూడా అలోచించి ఉదయ్ తో పెళ్లి వద్దని అనుకున్నారు అంతకు మించి వేరే కారణాలు లేవు. అలాగే ఉదయ్ కిరణ్ ను పవన్ గన్ తో బెదిరించాడు అన్నది కూడా ఒట్టి పుకారే అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ తెలిపారు. ఇక ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అవడానికి చిరు కారణం కానే కాదు, అంటూ చెప్పారు. నిజానిజాలు ఏవైనా ఉదయ్ కిరణ్ మరణం మాత్రం ఒక మిస్టరీ గానే మిగిలిపోవడం కాస్త బాధాకర విషయం.

Share post:

Latest