ప్రముఖ సీనియర్ నటి వేదన… NTRకు తల్లిగా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నా?

Jr. NTR గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఆయన ఒకరని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఇక అతనితో నటించాలని ఎలాంటి నటులకైనా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరైన మిర్చి మాధవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా స్వస్థలం గుంటూరు అని, హైదరాబాద్ లో చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అదే సమయంలో వరుసగా సీరియళ్లు, సినిమాలలో ఆఫర్లు రావడంతో బిజీగా మారానని అన్నారు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

అదంతా పక్కన పెడితే… ఆమె మన జూనియర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అదేమంటే ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ఆఫర్ మిస్ కావడం గురించి ఒకింత ఎమోషనల్ అయ్యింది. అందులో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని, బహుశా తన కంటే ఆ క్యారెక్టర్ ని బెటర్ గా ఎవరైనా చేస్తారని వాళ్లు అనుకుని ఉండవచ్చని మిర్చి మాధవి తెలిపారు. ఒక ప్రాజెక్ట్ రావాలంటే ఒక్కరు ఓకే చెబితే సరిపోదని, దాదాపు ఓ ఐదారుగురు ఉంటారని, వారందరూ మార్కులు వేస్తేనే వర్కవుట్ అవ్వడాన్ని సినీ వర్గాల్లో వున్న లొసుగులు గురించి చెప్పకనే చెప్పారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ… పాత్ర మిస్ అయితే ఫీల్ అవ్వడం అనేది మానవ సహజం అని, అనుకున్నది పోతే బాధ ఉంటుందని ఆమె అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో నేను ఇప్పటివరకు సినిమా చేయలేదని, భవిష్యత్తులో ఆ అవకాశం రావాలని ఆమె కోరుతున్నారు. ఇకపోతే టీవీలలో సీరియళ్లను చూసేవాళ్ల సంఖ్య తగ్గుతోందని యూట్యూబ్, హాట్ స్టార్ లలో చాలామంది సీరియళ్లు చూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలు, సీరియళ్లలో ఎవరిని పెడితే వాళ్లకు డబ్బులు వస్తాయో వాళ్లనే పెడతారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

Share post:

Latest