కమ్మ ‘ఫ్యాన్స్’ ఇక దూరమే!

ఏపీ రాజకీయాలపై కమ్మ, రెడ్డి వర్గాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రధాన పార్టీల అధ్యక్షులు ఈ కులాలకు సంబంధించిన నాయకులు కావడం వల్ల…ఆయా వర్గాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు కమ్మ వర్గం, జగన్ రెడ్డి వర్గం కావడంతో…టీడీపీకి కమ్మ వర్గం అనుకూలంగా, వైసీపీకి రెడ్డి వర్గం అనుకూలంగా ఉంటుంది. అయితే వైసీపీకి మద్ధతు ఇచ్చే కమ్మ వారు ఉన్నారు…టీడీపీకి సపోర్ట్ ఇచ్చే రెడ్డి వర్గం వారు ఉన్నారు.

కానీ గత ఎన్నికల్లో కమ్మ వర్గం టీడీపీకి అనుకున్న స్థాయిలో సపోర్ట్ చేయలేదనే చెప్పాలి…వారు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అందుకే వైసీపీలో కూడా కమ్మ ఎమ్మెల్యేలు ఎక్కువగానే గెలిచారు. అయితే ఇలా కమ్మ వర్గం సపోర్ట్ కాస్త వైసీపీకి దక్కింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కమ్మ వర్గం టార్గెట్ గా రాజకీయం ఎలా నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. కమ్మ వర్గం వారిని ఆర్ధికంగా దెబ్బకొట్టడంలో వైసీపీ ప్రభుత్వం ముందు ఉంది. ఎవరు ఏది అనుకున్న ఇది వాస్తవమనే సంగతి అందరికీ తెలుసు. ఆఖరికి పవన్ కల్యాణ్ సైతం కమ్మ వర్గానికి సపోర్ట్ గా వైసీపీపై ఫైర్ అయ్యారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఇటీవల ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కూడా కమ్మ వర్గం బయటకొచ్చింది. కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసి మాధవ్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఎలాగో మొదట నుంచి కమ్మ వర్గం టార్గెట్ గానే వైసీపీ రాజకీయం ఉంది. ఇప్పుడు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న కమ్మ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గత ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు ఇచ్చిన కమ్మ ఓటర్లు కొందరు…ఇప్పుడు వైసీపీకి దూరం జరిగారు. రానున్న రోజుల్లో కొందరు కమ్మ నేతలు వైసీపీ నుంచి బయటకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా వుయ్యూరు జెడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ..తన పదవికి రాజీనామా చేశారు. అయితే వైసీపీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడం, స్థానిక రాజకీయ కుట్రలు నేపథ్యంలో పూర్ణిమ వైసీపీ నుంచి బయటకొచ్చినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా వైసీపీలో ఉన్న కమ్మ నేతలు బయటకొస్తారని విశ్లేషకులు అంటున్నారు.