రీ రిలీజ్ ట్రైలర్ తో దుమ్ము లేపుతున్న జల్సా సినిమా..!!

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పాటు.. అమెరికాలో కూడా జల్సా సినిమా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 500 స్క్రీన్ లలో జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు విడుదల చేసి ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి మంచి విజయాన్ని అందించారు ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా ఘరానా మొగుడు చిత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది.PSPK 27: Pawan Kalyan Starrer First Look And Title To Be Unveiled On THIS  Date | Telugu Movie News - Times of Indiaఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా జల్సా సినిమాను అభిమానుల కోసం ప్రదర్శించబోతున్నారు ఇక అడ్వాన్స్ టికెట్స్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయినట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తిరిగి విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాను ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మార్పులు చేసి .. కలర్ కూడా సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి ఈ తరం ప్రేక్షకుల కోసం ఉన్నట్లుగా సరికొత్త టెక్నాలజీ హంగులను అమర్చి మరి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జల్సా సినిమా అభిమానుల కోసం ప్రత్యేకంగా ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

గీత ఆర్ట్స్ వారు ట్రైలర్ ను విడుదల చేశారు..జల్సా ట్రైలర్ పూర్తిగా మహేష్ బాబు ఓవర్ తో కొనసాగుతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ను ఇప్పటికి ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా మార్చి మళ్లీ యూట్యూబ్లో విడుదల చేయడం జరిగింది. ఎట్టకేలకు జల్సా సినిమా తో మరొకసారి పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సైతం తిరగరాస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest