జగన్-బాబు: ఎవరి డప్పు వారిదే..!

ఏపీ నాయకులకు రాజకీయం చేయడానికి ఏ స్టేజ్ అయిన ఓకే అన్నట్లు ఉంది…అసలు తాము ఎక్కడైనా రాజకీయమే చేస్తాం అన్నట్లుగా నేతల తీరు ఉంది…అలాగే తమని తాము పొగుడుకోవడం, ప్రత్యర్ధులని తిట్టడం. ఇదే పని మీద ఉన్నారు. అయితే విచిత్రంగా తాజాగా ఆగష్టు 15 వేడుకలని సైతం…సొంత డప్పు కోవడం వాడేసుకున్నారు…చంద్రబాబు, జగన్..

సాధారణంగా ఏ సభలోనైనా ఈ ఇద్దరు నేతలు చేసేది ఒకటే అని, కానీ ఆగష్టు 15 వేడుకల్లో కూడా ఇలా చేయడంపై జనం షాక్ అవుతున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఘనంగా నిర్వహించిన 76 స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన జగన్…ఎప్పటిలాగానే తనదైన శైలిలో..తాము ప్రజలకు మంచి చేశామని, మూడేళ్లలోనే అంతా చేసేశామని చెప్పుకొచ్చేశారు.

అసలు తమ పథకాలతో పేదరికం కూడా పోయిందని అన్నారు..అబ్బో ఇలా ఒకటి ఏంటి చాలా అంశాలపై జగన్ డప్పు కొట్టేశారని  జనం మాట్లాడుకునే పరిస్తితి. ఇక యథావిధిగానే…ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేశారు. ఇక జగన్ వర్షన్ ఇలా ఉంటే…చంద్రబాబు వర్షన్ మరోలా ఉంది…ఇంకా ఆయన అధికారంలోనే ఉన్నారని అనుకుంటున్నారు…అందుకే మళ్ళీ విజన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. గతంలో విజన్ 2020 పేరుతో బాబు ముందుకెళ్లారు..ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అంటూ మాట్లాడుతున్నారు. ఆయన కూడా తాజాగా ఆగష్టు 15 వేడుకల్లో పాల్గొని..యథావిధిగానే డప్పు కొట్టేసుకున్నారు.

టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా పనిచేసిందని, దేశంలో వచ్చిన అనేక సంస్కరణలతో టీడీపీ భాగస్వామిగా ఉందని మాట్లాడారు. అలాగే విజన్‌-2047 పేరుతో చంద్రబాబు కొన్ని సూచనలు కూడా చేశారు. ఇక ఎప్పటిలాగానే ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. అయితే స్వాతంత్య్ర వేడుకని సైతం…జగన్-చంద్రబాబులు..తమ రాజకీయ వేదికలుగా మార్చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతైనా రాజకీయ నాయకులు కదా…వారు రాజకీయమే చేస్తారని చెప్పొచ్చు.

Share post:

Latest