ఆళ్ళకు సీటు కూడా డౌటేనా?

ఈ మధ్య మంగళగిరిలో ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో నారా లోకేష్ ని మళ్ళీ ఓడించడానికి వైసీపీ సరికొత్త ఎత్తులతో రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి లోకేష్ ని ఓడించడానికి బీసీ కార్డు వాడటానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన లోకేష్…వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు..టీడీపీపై వ్యతిరేకత. జగన్ వేవ్, ఆళ్ళకు ప్రజల మనిషి అనే పేరు ఉండటం…ఇలాంటి కారణాల వల్ల లోకేష్ ఓడిపోయారు.

కానీ ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారు…నియోజకవర్గంలో సమస్యలపై పోరాడుతున్నారు…అలాగే ప్రజల్లో తిరుగుతూ, వారి మద్ధతు పెంచుకుంటున్నారు…ఇక రాజధాని అమరావతి అంశం లోకేష్ కు బాగా కలిసొస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో లోకేష్ ఈ సారి ఖచ్చితంగా గెలుస్తారనే ప్రచారం జరుగుతుంది. పైగా ఆళ్ళపై వ్యతిరేకత పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి.

ఇలాంటి తరుణంలో వైసీపీ సరికొత్త వ్యూహంతో మంగళగిరిలో రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే మంగళగిరి టీడీపీలో ఉన్న బలంగా ఉన్న బీసీ నేతలని తమ పార్టీల తీసుకున్నారు. అది కూడా బలమైన చేనేత వర్గానికి చెందిన నాయకులని లాగారు. తాజాగా గంజి చిరంజీవిని కూడా తీసుకున్నారు. ఈయన టీడీపీని వదిలేస్తూ…టీడీపీలో బీసీలకు న్యాయం జరగడం లేదని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు.

అయితే వైసీపీలో ఆళ్ళ…రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మరి అక్కడ బీసీలకు ప్రాధాన్యత లేదు. ఈ క్రమంలోనే నెక్స్ట్ మంగళగిరి సీటు బీసీ నేతకు అందులోనూ చేనేత వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందట. ఎలాగో ఆళ్ళపై వ్యతిరేకత ఉంది…కాబట్టి ఆయన్ని వేరే చోటకు పంపడం గాని, లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఈ సారి బీసీకు టికెట్ ఇస్తే మంగళగిరిలో లోకేష్ కు మళ్ళీ చెక్ పెట్టొచ్చు అనేది వైసీపీ ప్లాన్ గా ఉందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. అయితే ఇప్పటికే మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆళ్ళకు హ్యాండ్ ఇచ్చారు…ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకపోతే ఆళ్ళ పరిస్తితి ఏం అవుతుందో చూడాలి.