సిటీల్లో ‘ఫ్యాన్’ స్లో…ఫోకస్ !

అర్బన్ కంటే రూరల్‌లో వైసీపీకి పట్టున్న విషయం తెలిసిందే…గత రెండు ఎన్నికల్లో సిటీల్లో కంటే రూరల్ లోనే వైసీపీ అద్భుత విజయాలని అందుకుంది. అయితే గత ఎన్నికల్లో సిటీల్లో వైసీపీ పెద్దగా సత్తా చాటలేదు. టీడీపీని మంచి విజయాలు అందుకుంది..ఇప్పటికీ నగరాల్లో టీడీపీ బలం కనిపిస్తోంది…కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన సరే…అదంతా అధికార బలంతో వచ్చిన గెలుపుగానే కనబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలోచ్చేసరికి నగరాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి లాంటి స్థానాల్లో టీడీపీ గెలిచింది..వైసీపీ కూడా పలు నగరాల్లో సత్తా చాటింది. అయితే అప్పుడు వైసీపీ వేవ్ ఉంది…ఇప్పుడు అది తగ్గుతుంది..పైగా స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది…అలాగే టీడీపీ-జనసేన కాంబినేషన్ గాని సెట్ అయితే ఈ సారి నగరాల్లో వైసీపీకి దెబ్బపడేలా ఉంది.

వరుసగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం నగర స్థానాల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. కడప, చిత్తూరు కార్పొరేషన్ల పరిధిలో వైసీపీకి బలం కనిపిస్తోంది. మిగిలిన కార్పొరేషన్ల పరిధిలో టీడీపీకి లీడ్ కనిపిస్తోంది…జనసేన కలిస్తే ఇంకా అడ్వాంటేజ్ పెరుగుతుంది.

కాబట్టి నగర స్థానాలపై వైసీపీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం కదా ఇంకా తిరుగులేదు అని అనుకోకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు నగరాల్లో ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది…లేదంటే వైసీపీకి చిక్కులు తప్పవు. టీడీపీ-జనసేన పొత్తు ఉంటే దాదాపు 14 కార్పొరేషన్ల పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి. కేవలం కడప, చిత్తూరుకే వైసీపీ పరిమితం కావొచ్చు.

నిజానికి కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి వైసీపీ కంచుకోటలే. కానీ ఆయా నగరాల్లో సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లోనే కర్నూలు, నెల్లూరు, తిరుపతి సిటీల్లో టీడీపీ చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఈ సారి వాటిని వదిలేలా లేదు. కాబట్టి నగరాలపై జగన్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.