ర‌వితేజ‌తో రొమాన్స్ చేసిన ఈ హీరోయిన్ సీబీఐ ఆఫీస‌ర్ కూతురా..ఇంత బ్యాక్‌గ్రౌండా..?

ఇటీవల రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాజీషా విజయన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జై భీమ్ సినిమాతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. నిజానికి జై భీమ్ సినిమా ద్వారా అందరికీ పరిచయమైనా.. అంతకుముందే కర్ణన్ అనే సినిమా ద్వారా ధనుష్ సరసన నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక తమిళ్, మలయాళం భాషలో వరుస అవకాశాలు అందుకుంటూ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా తెలుగు తెరకు కూడా పరిచయం అయింది.Rajisha Vijayan to make her Telugu debut opposite Ravi Teja- Cinema express

మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో దివ్యాంశా కౌశిక్ తో పాటు రాజీషా విజయన్ కూడా హీరోయిన్గా నటించారు అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చెప్పాలి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ మరియు RT టీం వర్డ్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా పెద్దగా కలెక్షన్లను రాబట్ట లేకపోయింది. ఇకపోతే రాజీషా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు నేర్చుకుంటున్నాను.. ఇక త్వరలోనే స్వయంగా డబ్బింగ్ కూడా చెబుతాను అని తెలిపింది అంతేకాదు తన బాల్యం గురించి కూడా చెబుతూ ఉత్తరాదిలో పెరిగాను.. నాన్న ఆర్మీలో ఆ తర్వాత సీ బీ ఐ లో కూడా పనిచేశారు. ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల కేరళలో ఎక్కువగా నివసించలేకపోయాను.Second Single From 'Ramarao On Duty' To Be Out On May 7ముఖ్యంగా రవితేజ నటించిన ఎన్నో సినిమాలు హిందీలో డబ్ అయ్యేవి. నాకు నా స్నేహితులందరికీ రవితేజ బాగా తెలుసు .అప్పుడు నేను అతన్ని హిందీ హీరో అనుకున్నాను.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కానీ రవితేజకు చాలా కాలం క్రితమే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది . నేను ఆయన అభిమానిని కానీ ఆయన సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. అతను ఒక హంబుల్ జెన్యూన్ పర్సన్ అంటూ మెచ్చుకుంది. ఇకపోతే సిబిఐ ఆఫీసర్ కూతురుగా ఇండస్ట్రీలో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు ర
రాజీషా విజయన్.

Share post:

Latest