ఉరవకొండలో పయ్యావులకు కష్టమేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్నీ స్థానాల్లో టీడీపీ పరిస్తితి ఒకలా ఉంటే..ఉరవకొండ స్థానంలో మరొకలా ఉంటుంది. మొదట నుంచి ఈ స్థానంలో వెరైటీ ఫలితాలు వస్తూనే ఉంటాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఇక్కడ గెలవదు. 1999 ఎన్నికల నుంచి ఉరవకొండలో ఇదే పరిస్తితి నడుస్తూ వస్తుంది. 1999లో టీడీపీ అధికారంలోకి వస్తే ఉరవకొండలో కాంగ్రెస్ గెలిచింది.

ఇక 2004. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తే…ఉరవకొండలో టీడీపీ గెలిచింది. అలాగే 2014లో టీడీపీకి అధికారం దక్కింది…కానీ ఉరవకొండలో గెలిచింది వైసీపీ. 2019లో మళ్ళీ రివర్స్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ఉరవకొండలో టీడీపీ గెలిచింది. ఇలా ఇక్కడ వెరైటీ ఫలితాలు వస్తూనే ఉంటాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఎలాంటి తీర్పు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సెంటిమెంట్ గాని రిపీట్ అయితే…మళ్ళీ టీడీపీ గెలవడం, వైసీపీ అధికారంలోకి రావడం జరుగుతుంది.

లేదంటే ఉరవకొండలో వైసీపీ గెలవడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం జరుగుతుంది. దీని బట్టి చూస్తే నెక్స్ట్ పయ్యావుల కేశవ్ భవిష్యత్ ఏం అవుతుందనే డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇంతకాలం టీడీపీ నుంచి గెలుస్తుంది ఆయనే. ఏదో 1994లో గెలిచినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది గాని…మిగిలిన అన్నిసార్లు అధికారంలో లేదు. ఇప్పుడు నెక్స్ట్ అదే రిపీట్ అయితే… ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు.

కానీ ఆ సెంటిమెంట్ ని ఈ సారి పయ్యావుల ఏమన్నా బ్రేక్ చేస్తారేమో చూడాలి. అయితే ప్రస్తుతం పరిస్తితులు చూస్తుంటే ఉరవకొండలో కేశవ్ కు అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఇక్కడ వైసీపీ నుంచి ఓడిపోయిన విశ్వేశ్వర్ రెడ్డిపై సానుభూతి ఎక్కువ కనిపిస్తోంది.  ఒకవేళ గాని విశ్వేశ్వర్ రెడ్డి గెలిస్తే…రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందేమో.  అంటే పాత సెంటిమెంట్ బట్టి చూస్తే అదే జరుగుతుంది. మొత్తానికి ఉరవకొండ సెంటిమెంట్ చూసుకుంటే ఈ సారి పయ్యావుల పరిస్తితి ఏం అవుతుందో చూడాలి.