పవన్ ప్రత్యర్ధికి సీటు డౌటేనా?

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఓడించి…తిప్పల నాగిరెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే…గాజువాక బరిలో తిప్పల నాగిరెడ్డి మంచి విజయమే అందుకున్నారు. వాస్తవానికి గాజువాక వైసీపీకి  పెద్దగా అనుకూలమైన నియోజకవర్గం కాదు…2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన గాజువాకలో…మొదట ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో టీడీపీ గెలిచింది.

అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా పవన్ పోటీ చేయడంతో ముక్కోణపు పోటీ నడిచింది…వైసీపీ-టీడీపీ-జనసేనల మధ్య పోటీ జరిగింది. కానీ ఇక్కడ వైసీపీ గెలవడానికి ఒకే ఒక కారణం…టీడీపీ-జనసేనల మధ్య ఓట్లు చీలిపోవడం…ఒకవేళ ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే అప్పుడే వైసీపీకి చెక్ పడేది. అలా ఓట్లు చీలిపోవడం వల్ల నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. ఇక పవన్ కల్యాణ్, టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు.

ఇలా పవన్ పై గెలిచి  సంచలనం సృష్టించిన నాగిరెడ్డిపై ప్రజలకు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి…కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా పనిచేయడంలో నాగిరెడ్డి విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఆయనకు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ పెరిగినట్లు తెలుస్తోంది. పైగా స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ పుంజుకుంటున్నారు. ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరుగుతుంది.

వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పవన్ పోటీ చేసే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి…ఈ సారి ఆయన భీమవరం బరిలో ఉండొచ్చు. అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే…ఈ సీటు టీడీపీకే దక్కేలా ఉంది. అప్పుడు వైసీపీ విజయం కష్టమయ్యేలా ఉంది. ఒకవేళ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసినా సరే…ఈ సారి గాజువాకలో వైసీపీ విజయం చాలా కష్టమయ్యేలా ఉంది. అయితే నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు దొరకడం కష్టమని ప్రచారం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ అభ్యర్ధి మారి, టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి కాస్త ప్లస్ ఉంటుంది. లేదంటే గాజువాకని వైసీపీ కోల్పోవాల్సిందే.

Share post:

Latest