సేనానికి సింగిల్ డిజిట్?

గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలనే కసితో పనిచేస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు..అధికారంలోకి రాకపోయినా సరే..అధికారాన్ని డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఛాన్స్ దొరికితే తమ అధినేత సీఎం అవుతారని జనసైనికులు భావిస్తున్నారు. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

అసలు జనసేనకు బలం లేకుండా ఏకంగా సీఎం సీటు ఎలా ఇస్తారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి…అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నాయి. ఇటు జనసేన శ్రేణులు కూడా తాము సింగిల్ గా పోటీ చేస్తామని మాట్లాడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు సింగిల్ గా పోటీ చేస్తే మధ్యలో బెనిఫిట్ అయ్యేది వైసీపీకే. ఆ విషయం రెండు పార్టీలకు తెలుసు…కానీ రెండు పార్టీలు పంతానికి పోతున్నాయి.

సరే ఇక్కడ టీడీపీ జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది…ఆ పార్టీ అధికారానికి కూడా దూరం కావొచ్చు. కాసేపు టీడీపీ గురించి పక్కన పెడితే…జనసేన నష్టం గురించి మాట్లాడుకుంటే…ఆ పార్టీకి గట్టిగానే డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లోనే జనసేన ఎంత నష్టపోయిందో తెలిసిందే. ఆఖరికి పవన్ కూడా ఓడిపోయారు.

ఈ సారి కూడా ఒంటరిగా గాని, బీజేపీతో పొత్తు ఉన్నా సరే జనసేనకు పెద్దగా ఒరిగేది ఏమి లేదు. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు ఉన్న జనసేనకు ఉపయోగం లేకుండా పోయింది…ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉన్న నో యూజ్. ఇటీవల వస్తున్న సర్వేల్లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఏమి లేవని తేలింది. అయితే కొద్దో గొప్పో గెలిచే ఛాన్స్ ఉన్న సీట్లు నాలుగు ఉన్నాయని, అలాగే 3 సీట్లలో జనసేనకు కాస్త బలం ఉందని, ఓవరాల్ గా ఏడు సీట్లలో మాత్రం జనసేనకు బలం ఉందని తేలింది…వీటిల్లో ఎన్ని గెలుస్తుందో క్లారిటీ లేదు. కానీ టీడీపీతో పొత్తు ఉంటే ఏడు కాదు…దాదాపు 20 సీట్లు వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి సేనానికి సైకిలే ప్లస్..సైకిల్ కు సేనాని ప్లస్.