జమ్మలమడుగు బీజేపీకేనా?

జమ్మలమడుగు…ఏ డౌట్ లేకుండా కడపలో ఉన్న వైసీపీ కంచుకోట అని చెప్పొచ్చు. అసలు కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట. జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం వైసీపీ కంచుకోటే…అందులో జమ్మలమడుగు గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి జమ్మలమడుగులో వైఎస్సార్ హవా ఉంది…వైఎస్సార్ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. జగన్ వైసీపీ పెట్టాక..ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. అయితే 1983 నుంచి 1999 వరకు వరుసగా జమ్మలమడుగులో టీడీపీ గెలిచింది…కానీ 2004 నుంచి ఇక్కడ వైఎస్సార్ హవా మొదలైంది.

ఈ క్రమంలోనే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి వరుసగా కాంగ్రెస్ నుంచి గెలిచారు..2004, 2009 ఎన్నికల్లో సత్తా చాటారు. తర్వాత 2014లో వైసీపీ నుంచి గెలిచారు…నెక్స్ట్ ఆయన టీడీపీలోకి వచ్చి మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో సేఫ్ సైడ్ గా టీడీపీని వదిలి బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నా సరే వైసీపీపై విమర్శలు చేయడం ఆపలేదు.

అలాగే నెక్స్ట్ జమ్మలమడుగు బరిలో ఉంటానని ఎవరు వస్తారో రావాలని వైసీపీకి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆది ఛాలెంజ్ బాగానే ఉంది…కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆదికి వ్యక్తిగతంగా ఫాలోయింగ్ ఉంది గాని…జమ్మలమడుగులో గెలిచెంత ఫాలోయింగ్ లేదు…అలాగే ఇక్కడ బీజేపీకి బలం లేదు. ఇక్కడ వైసీపీకి చెక్ పెట్టాలంటే ఆది బీజేపీలో పోటీ చేస్తే కుదరదు. ఆయనకు టీడీపీ సపోర్ట్ కావాలి.

ఒకవేళ టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే మాత్రం ఈ సీటు బీజేపీకే దక్కే ఛాన్స్ ఉంది…అప్పుడు ఆది పోటీకి దిగొచ్చు. కానీ పొత్తు డౌట్. పైగా అక్కడ టీడీపీ ఇంచార్జ్ గా ఆది సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి ఉన్నారు. అలాంటప్పుడు అంత తేలికగా సీటు ఆదికి దక్కడం కష్టమే. అయితే ఆది టీడీపీలోకి వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అప్పుడైనా సీటు వస్తుందా? అనేది చెప్పలేం. మొత్తానికైతే ఆది సవాల్ చేసినంత ఈజీగా జమ్మలమడుగులో వైసీపీకి చెక్ పెట్టడం కష్టం.