మోడీతో గ్యాప్.. జ‌గ‌న్‌కు మంచిదేనా..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ .. ఇలాంటి సందేహ‌మే క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త మూడేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయ‌న చేస్తున్నారు. ఏది కావాల‌న్నా ఇస్తున్నారు. రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించారు. ఎప్పుడు ఆప‌ద‌లో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భ‌రోసా ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు అదే కేంద్రంతో జ‌గ‌న్ విభేదించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎందుకంటే.. కేంద్రాన్ని జ‌గ‌న్ కోరిన ఏ ఒక్క‌టి కూడా సాధించుకోలేక పోయారు. ప్లీజ్ .. ప్లీజ్‌.. అంటూ.. ప్ర‌త్యేక హోదాను అడుగుతూనే ఉన్నారు. వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధులు ఇవ్వాల‌ని.. అభ్య‌ర్థించారు. అదేవిధంగా పోల‌వ‌రం నిధులు ఇవ్వాల‌ని.. నిర్వాసితుల‌కు న్యాయం చేయాల‌ని.. కోరుతూనే ఉన్నారు. ఇక‌, రాష్ట్రానికి ఆర్ధికంగా ఆదుకునేందుకు సాయం చేయాల‌ని కూడా అడుగుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా తాను తీసుకున్న దిశ చ‌ట్టం నిర్ణ‌యానికి ప‌చ్చ‌జెండా ఊపాల‌ని కూడా జ‌గ‌న్ కోరుతున్నా రు. అలాగే.. మూడు రాజ‌ధానులు.. హైకోర్టు త‌ర‌లింపు.. వంటి కీల‌క విష‌యాల్లోనూ కేంద్రం స‌హ‌క‌రించా ల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం ఇలాంటివిష‌యాల్లో ఒక్క‌టి కూడా రాష్ట్రానికి స‌హ‌క‌రించ‌లేదు. ఇక‌, త‌మ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌పై వేటు వేయాల‌ని కోరినా.. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఏపీ అప్పుల త‌ప్పులు చేస్తోందంటూ.. కేంద్ర ఆర్థిక శాఖ లోగుట్టును బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది.

We'll see brighter India: PM Modi in Tirupati

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇక‌, కేంద్రంతో ఉండి ఏం లాభం అనుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అందుకే.. ఆయ‌న వ‌చ్చే రెండేళ్ల‌లోనే.. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.అ యితే.. ఇది ఏమేర‌కు మంచిద‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఎందుకంటే.. జ‌గ‌న్ గ్యాప్ ఇస్తే.. తాము కేంద్రంతో చేతులు క‌లిపేందుకు టీడీపీ రెడీగా ఉంది. ఇప్ప‌టికే.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌జ‌గ‌న్ వ్యూహానికి చిక్కుకుని.. తాము బీజేపీకి దూర‌మ‌య్యామ‌నే భావ‌న టీడీపీకి ఉంది.

ఈ నేప‌థ్యంలో తాజా ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రి ఈ విష‌యం తెలిసి కూడా జ‌గ‌న్ .. గ్యాప్ పెంచుకుంటున్నారంటే.. కేంద్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయ‌ని.. అనుకుంటున్నారో.. లేక కేంద్ర స‌హ‌కారం లేకున్నా.. త‌మ‌కు ఏమీ కాద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారా? అనేది ఆస‌క్తిగా మారింది. చూడాలి ఏం జ‌రుగుతుందో.