ప్రత్తిపాటి-దేవినేని రివెంజ్ ప్లాన్?

గత ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలు ఓడటం చాలా కష్టమని అనుకున్నారు…అసలు బలంగా ఉన్న ఆ నేతలని ఓడించడం వైసీపీకి సాధ్యం కాదని అంతా భావించారు. కానీ జగన్ వేవ్ లో అంతా కొట్టుకుపోయారు…జూనియర్ లేదు…సీనియర్ లేదు…అందరికీ ఓటమి వచ్చింది. అలా ఊహించని ఓటమి వచ్చిన నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలు ముందు ఉంటారు. అసలు ఈ ఇద్దరు నేతలని ఓడించడం జరిగే పని కాదని విశ్లేషణలు వచ్చాయి.

కానీ ఈ ఇద్దరునే తలని ఊహించని విధంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారే ఓడించారు.  వాస్తవానికి దేవినేని ఉమాకు..వసంత నాగేశ్వరరావు ఫ్యామిలీకి రాజకీయ శతృత్వం ఎప్పటి నుంచో ఉంది. కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక….వసంత ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చింది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి రాజకీయం చేశారు. కానీ అప్పటివరకూ టీడీపీలో ఉన్న ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరి మైలవరం టికెట్ దక్కించుకున్నారు. ఆ సీటులో టీడీపీ తరుపున దేవినేని ఉమా ఉన్నారు. అప్పటికే ఉమా..నందిగామలో రెండు సార్లు, మైలవరంలో రెండు సార్లు గెలిచి ఉన్నారు. అంటే ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. అలాంటి నాయకుడుకు వసంత చెక్ పెట్టారు. 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించారు.  ఇక ఇలా తనని ఓడించిన వసంత పై రివెంజ్ తీర్చుకోవడానికి ఉమా గట్టిగానే కష్టపడుతున్నారు…నెక్స్ట్ ఎన్నికల్లో మైలవరం బరిలో వసంతని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తుంటే మైలవరంలో ఉమాకు  అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. అటు చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుని విడదల రజిని ఓడించారు. రజిని సైతం అప్పటివరకూ టీడీపీలో పనిచేసి..సడన్ గా వైసీపీలో చేరి…పేట టికెట్ దక్కించుకుని ప్రత్తిపాటికి చెక్ పెట్టారు. అలా తొలిసారి గెలిచిన రజిని…మంత్రి కూడా అయ్యారు. ఇలా తన వెనుకే నడిచి…తనని ఓడించిన రజినికి చెక్ పెట్టాలని ప్రత్తిపాటి కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ సారి ఎలాగైనా రజినిని ఓడించాలని పనిచేస్తున్నారు. పేటలో ఈ సారి పైచేయి సాధించి రివెంజ్ తీర్చుకోవాలాని చూస్తున్నారు. మరి చూడాలి ప్రత్తిపాటి-దేవినేని రివెంజ్ తీరుతుందో లేదో.