ఇష్టం లేకపోయినా నాగార్జునతో ఆ పని చేశానంటున్న సీనియర్ నటి.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు?

టాలీవుడ్ మన్మధుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్కరు. అతడే అక్కినేని నాగార్జున. అవును… తన తండ్రి.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మొదట నాగార్జునని ఇండస్ట్రీకి పరిచయం చేసినపుడు ఒకింత వ్యాకులత చెందారట. సన్నగా వున్నాడు, పీలగా వున్నాడు, అంత అందం కూడా లేదు.. వీడిని తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారా? అనే మీమాంశతోనే పరిచయం చేసాడట. ఇక తరువాతి రోజుల్లో ఆ బక్క అబ్బాయే టాలీవుడ్ మన్మధుడు అయ్యి కూర్చున్నాడు. ఇకపోతే నాగ్ అంటే తెలుగునాట అమ్మాయిలకు ఎంత క్రేజో చెప్పాల్సిన పనిలేదు.

నాగార్జున అంటే సాధారణ అమ్మాయిలకే కాదు, హీరోయిన్లకు కూడా ఎంతో క్రేజ్. ఆయనతో నటించాలని అప్పట్లో కలలు కనేవారట. అలాంటి నటీమణులలో ఇంద్రజ ఒకరు. ఇప్పుడు హీరోయిన్లు అడపాదడపా ఐటెం సాంగ్స్ లో నటించినట్టే అప్పటి హీరోయిన్స్ కూడా నటించేవారు. అప్పట్లో ఇంద్రజ రెండు ఐటమ్ సాంగ్స్ వరుసగా చేసింది. అందులో ఒకటి నాగార్జున సరసన “కన్నెపిట్టరో” అనే సాంగ్ చేసి అలరించింది. అలాగే ఒక తమిళ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసిందట. తాజా ఇంటర్వ్యూలో వాటి గురించి ప్రశ్నించగా ఇంద్రజ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

నిజానికి అలాంటి సాంగ్ చేయాలని అప్పుడు ఆమె అనుకోలేదట. సినీ పెద్దల రిక్వెస్ట్ వల్లే ఆ సాంగ్స్ చేయాల్సి వచ్చింది. పెద్ద పెద్ద బ్యానర్ వాళ్లు అడిగినప్పుడు నో అని చెప్పలేము. నేను ఇష్టం లేకుండానే ఆ పాటకు డాన్స్ చేశాను. ఇప్పుడు ఎందుకు లేండి ఇప్పుడు ఏం మాట్లాడినా లేనిపోని వివాదాలు నా చుట్టు ముడుతాయి. వాటి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ చెప్పుకొచ్చింది ఇంద్రజ. అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద బ్యానర్లు హీరోయిన్లను బలవంతంగా ఇష్టం లేని వాటిని చేయమని ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పకనే చెప్పేసింది.

Share post:

Latest