‘డబ్బు ఉంటేనే’..టీడీపీ కొత్త ఫార్ములా?

నెక్స్ట్ ఏపీ ఎన్నికలు పూర్తిగా డబ్బుమయం కానున్నాయి…ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి వందల కోట్లు ఖర్చు పెట్టేలా ఉన్నారు. అయితే నెక్స్ట్ అధికారంలోకి రావాలని టీడీపీ తెగ కష్టపడుతుంది. అధికారంలోకి రావాలంటే ప్రజా మద్ధతు మాత్రమే ఉంటే సరిపోదు…ఆర్ధిక బలం, అంగ బలం ఉండాలనేది టీడీపీ ఫార్ములా. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండటంతో..వైసీపీకి చెందిన అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా ఉంటారనేది టీడీపీ అంచనా.

- Advertisement -

అలాంటప్పుడు అధికారం, ఆర్ధికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్ధులని ఓడించడం ప్రతిపక్షంలో టీడీపీకి చాలా కష్టం. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక చాలామంది నేతలు ఆర్ధికంగా దెబ్బతిన్నారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు టీడీపీ నేతల ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టింది. దీని వల్ల టీడీపీ నేతలు ఆర్ధికంగా దెబ్బతిని ఉన్నారు…పైగా ప్రతిపక్షంలో ఉంటే సొంతంగానే ఖర్చు పెట్టాలి. ఇది టీడీపీ నేతలకు పెద్ద భారం అవుతుంది.

అధికారంలో లేకుండా పార్టీ కార్యక్రమాలు చేయడం, కార్యకర్తలని నడిపించడమే అనేది చాలా కష్టం. డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో ఏ పని అయిన జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ నేతలు చాలా వరకు ఖర్చు పెట్టి ఉన్నారు. ఇక ఎన్నికల్లో ఆర్ధికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్ధులని ఓడించాలంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. అందుకే టీడీపీ అధిష్టానం కూడా ఆర్ధికంగా బలంగా ఉన్నవారికే సీట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

డబ్బులు లేకుండా ఎలాంటి సీనియర్ నేత ఉన్నా సరే వారికి టికెట్ ఇచ్చేలా కనబడటం లేదు. డబ్బులు ఉంటే చాలు కొత్త నేతలకు సీటు ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇదే క్రమంలో పలుచోట్ల కొత్త అభ్యర్ధుల్ని పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దర్శిలో ఎంతో కష్టపడి పనిచేసిన పమిడి రమేశ్ సైడ్ అయిపోగా, దుబాయికి చెందిన సుబ్బారావుకు సీటు ఇచ్చేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. అటు తిరుపతి సీటు..ఈ సారి సుగుణమ్మకు కాకుండా ఆర్ధికంగా బలంగా ఉన్న జేబీ శ్రీనివాస్ ని పెట్టేందుకు చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే డబ్బు ఉంటేనే సీటు అన్నట్లు టీడీపీ ఫార్ములా ఉంది.

Share post:

Popular