చిరంజీవిని కలిస్తే ఆ సినిమా డిజాస్టరెనా…!!

తాజాగా హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. ఈ సినిమాని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా అనన్య పాండే నటించగా.. ముఖ్యమైన పాత్రలలో మైక్ టైసన్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా ఫ్లాప్ ని కూడా చిరంజీవికి మూటగడుతున్నారు వాటి గురించి చూద్దాం.Megastar Chiranjeevi wishes Vijay Deverakonda, Puri Jagannadh for Liger Day  - Movies News

ఇక చిరంజీవి ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత.. చిరంజీవి ఏ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లినా.. ఏ సినిమా ఆడియో ఫంక్షన్ కి వెళ్లినా ఆ సినిమా ఫ్లాప్ అన్నట్లుగా పలువురు నెటిజన్ లు కామెంట్ చేస్తూ ఉన్నారు. అలా తాజాగా లాల్ సింగ్ చద్ద.. అలాగే పక్కా కమర్షియల్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు.Aamir Khan and Chiranjeevi amped up the star power at this pre-release  event | Telugu Movie News - Times of India

ఇక ఈ సినిమాలకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వక డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఇక చిరంజీవి లైగర్ ప్రమోషన్లలో పార్టిసిపేట్ చేయలేదు కానీ ఆ సినిమాకు సంబంధించి విజయం కోసం చిరంజీవి షూటింగ్ సమయంలో ఉండగా చిరంజీవిని వెళ్లి చిత్ర బృందం కలవడం జరిగింది.Pakka Commercial Pre-Release Event.ఇక అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.. ఇక ఆచార్య డిజాస్టర్ తర్వాత .. చిరంజీవి ఎలాంటి ఈవెంట్లకు వెళ్లిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని కొంతమంది క్రిటిక్స్ తెలియజేస్తూ ఉన్నారు. అయితే చిరంజీవి సినీ ఇండస్ట్రీ కోసం చాలా కష్టపడే తత్వం వున్న వ్యక్తి అని చెప్పవచ్చు.Why Go Into Politics? I Feel That .. Chiru Naughty Comments On Tapsi

ఇక మెగా అభిమానులు సైతం చిరంజీవి తన సమయాన్ని కేటాయించి సినిమాల కోసం ఆ సినిమా ఎఫెక్టివ్ గా రావడం కోసం ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళితే ఇలా నెగిటివ్ కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా ఫైర్ అవుతున్నారు. దీంతో చిరంజీవి ఏ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళినా ఆ సినిమా ఫ్లాప్ అని మాటను తెలియజేస్తున్నారు.