నిర్మాణ రంగం లో చేతులు కాల్చుకుని దివాలా తీస్తున్న హీరోయిన్స్.

హీరోయిన్స్ కి నిర్మాణ రంగం అంత గ అచ్చిరావట్లేదు.ఏ ఒక్క హీరోయిన్ కూడా ప్రొడ్యూసర్ గ సక్సెస్ అవలేదు.దీనికి ఉదాహరణ అలనాటి మహానటి సావిత్రి నుండి లైగర్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఛార్మి వరకు చాలామంది వున్నారు..వీరంతా నిర్మాణ రంగం లో చేతులు కాల్చుకున్న వాళ్ళే.కొంతమందయితే సర్వస్వం పోగొట్టుకుని రోడ్ మీద కి వచ్చేసారు కూడా..

ఇక వివరాల్లోకెళ్తే రీసెంట్ గ విడుదలయిన లైగర్ సినిమా ప్లాప్ టాక్ సొంతం చేసుకుని భారీగా నష్టాలు చవిచూసినంది.అయితే ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన ఛార్మి కూడా బాగా నష్టం వచ్చేలా వుంది.ఒకప్పటి హీరోయిన్ ఛార్మి తెలుగులో చాల మంది పెద్ద హీరోలతో సినిమాలు చేసి,ఇపుడు నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు.అయితే లైగర్ సినిమా కంటే ముందు ఛార్మి నిర్మాతగా ఉన్న సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడింది.
ఛార్మి లాగానష్టపోయిన మరొక హీరోయిన్ భూమిక.భూమిక కూడా తకిట తకిట అనే సినిమా నిర్మించి కంగుతిన్నారు.ఇంకా ఫామిలీ సినిమా హీరోయిన్ అయిన కళ్యాణి తన భర్త డైరెక్షన్ లో సినిమాలు నిర్మించి దెబ్బ తిన్నారు.

ఇక అలనాటి హీరోయిన్స్ సావిత్రి,జయసుధ కూడా ఇదే కోవలోకి వస్తారు.ఒక సినిమా ని తెరకెక్కించాలంటే ఆ నిర్మాత పడే కష్టం మాములుగా ఉండదు.ఒకసారి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టాల్సొస్తుంది,ఒక వేళా ఆ సినిమా ప్లాప్ అయితే ఇక అంతే.మాములుగా హీరో కంటే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ చాల తక్కువగా ఉంటుంది.ఇలా కష్టపడి సంపాదించిన మొత్తాన్ని సినిమా నిర్మాణం లో పెట్టి సర్వం పోగొట్టుకుంటున్నారు.అలనాటి మహానటి సావిత్రి ఇందుకు నిదర్శనం.ఆమె నిర్మాణ రంగం లో అడుగుపెట్టాకే సర్వం కోల్పోయారు.మోసగించబడ్డారు.ఏదయితేనే మొత్తమ్ పోగొట్టుకున్నారు.

అయితే పాపులర్ హీరోయిన్స్ అయినా కాజల్,తమన్నా కూడా నిర్మాణ రంగం లో అడుగుపెట్టనున్నారని ఒక వార్త అప్పట్లో హల్చల్ చేసింది.అయితే వారు ఈ ఆలోచన మానుకున్నట్టే తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటివరకు నిర్మాతగా సక్సెస్ అయినా హీరోయిన్ ఒకరు కూడా లేరు.నిర్మాణరంగం లో అందరూ హీరోయిన్స్ కలిసిరాక వెనుదిరిగినవారే కదా.ఇప్పటికయినా హీరోయిన్స్ మేలుకుని నిర్మాతగా మరకపోవటమే బెటర్ ఎందుకంటే నిర్మాణ రంగం వారికీ అచ్చిరావట్లేదు కనుక.ఇక నయినా హీరోయిన్స్ సినిమా నిర్మాణం ఆపుతారో లేదంటే ఇంకా ఇలాగె చేసి చేతులు కాల్చుకుంటారో చూడాలి.