దేశ‌వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్‌… ఎంత హాట్ టాపిక్ అంటే…!

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం స‌ర్వ‌త్రా ఆసక్తి రేపింది.

బీజేపీ కన్ను ఎన్టీఆర్ పై పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ – అమీత్ షా భేటీ గురించి ఒక తెలుగులోనే కాదు… దేశవ్యాప్తంగా ఈ విషయం ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇతర భాషల్లో కూడా అమిత్ షా – ఎన్టీఆర్ భేటీ గురించి వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.
ఆదివారం మధ్యాహ్నం నుంచి #Amit Shah with NTR అనే హ్యాష్ స్టాగ్‌తో ట్విట్టర్లో లక్షల కొద్ది ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.

ఎన్టీ ఆర్ – అమిత్ షాతో మీటింగ్ వెన‌క‌ ఇంకో ముఖ్య కారణం కనిపిస్తుంది. ఎన్టీఆర్ మేనత్త పురందేశ్వరి బిజెపిలో ఆగ్ర నాయకురాలుగా కొనసాగుతున్నారు. అమే ఎన్టీఆర్‌ని బిజెపిలో చేర్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారట‌. ఇదే క్రమంలో ఎన్టీఆర్ అమిత్ షా భేటీ దేశ వ్యాప్తంగా అందరి చూపు పడేలా చేసింది.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక షా త్రిబుల్ ఆర్‌లో ఎన్టీఆర్ నటనను అభినందించడానికి పిలిచారని.. ఈ భేటీకి రాజ‌కీయాల‌కు లింక్ లేద‌ని బీజేపీ వాళ్లు అంటున్నారు.

Jr NTR - Amit Shah Meeting Lasted For 15 Minutes

Share post:

Latest