హీరోయిన్ త్రిష గురించి తెలియని సినిమా ఆడియన్ ఉండడు. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న త్రిష తరువాతికాలంలో కోలీవుడ్లో మంచి హీరోయిన్ గా పాతుకుపోయింది. అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం దాటినప్పటికీ ఇప్పటికీ సినిమా ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి. ఇకపోతే, కొద్ది రోజులుగా త్రిష పాలిటిక్స్‌లో అడుగుపెట్టబోతుందంటూ జోరుగా ప్రచరాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రూమర్స్‌పై ఓ క్లారిటీ వచ్చింది.
అవును… ఆమె రాజకీయ ఎంట్రీపై తాజా ఓ స్పష్టతని ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెను పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా.. అదేమీ లేదని తేల్చి చెప్పారు. ఆమె మాట్లాడుతూ… “ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుడతాయో నాకసలు అర్ధం కాదు. నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవటం లేదు. అసలు అలాంటి ప్లానే లేదు!” అంటూ కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది. ఆమె కాంగ్రెస్‌లో చేరతారన్న ఊహాగానాలపై…అటు ఆ పార్టీ కూడా క్లారిటీ ఇచ్చింది. త్రిషను తమ పార్టీలోకి ఆహ్వానించలేదని వెల్లడించింది.
ఇకపోతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ కూడా దీనిపై స్పందించారు. త్రిష కాంగ్రెస్‌లో చేరడంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఈ సమాచారం, ప్రచారం నిజమో? కాదో తనకు తెలియదన్నారు. ఆమె పార్టీలో చేరడం ద్వారా పార్టీకి బలమవుతుందని తాను భావించడం లేదని, పెద్దగా స్పందన కూడా ఉండదన్నారు. త్రిషనే కాదు ఇంకెవరైనా తమ పార్టీలో చేరుతామంటే స్వాగతిస్తామని ఇళంగోవన్ పేర్కొన్నారు. సినిమాలలో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష సరైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పోటీ చేస్తే ఆమె ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేమీ కాదు అని ఆమె అభిమానులు అంటున్నారు.
త్రిష పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ కావాలా? ఇదే నిదర్శనం!
