మూడేళ్లుగా అలా చేస్తూనే ఉన్న..ఫస్ట్ టైం ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసిన విక్రమ్ ..!!

తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథ‌ల‌తో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్. ఆయన మల్లన్న, అపరిచితుడు వంటి ఎన్నో వైవిధ్యమైన కథ అంశాలతో ఉన్న సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. తాజాగా విక్రమ్‌ అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్షన్ లో కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

South Mega Star Chiyaan Vikram Heart Attack News: Dhruv Vikram Said Just Mild Chest Discomfort » All News

ఈ సినిమా ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంలో… ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విక్ర‌మ్‌ ఆయన కుమారుడు ధృవ్‌ విక్రమ్‌ తో కలిసి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో తండ్రి కొడుకుల సందడి హైలెట్ గా నిలిచింది. ఈ ఈవెంట్లో విక్రమ్ కొడుకు మాట్లాడుతూ ..”నేను నా తండ్రి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను . నాకు నా తండ్రి రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. నా తండ్రి నటించిన కోబ్రా సినిమా సూపర్ హిట్ అవుతుందని” అన్నారు.

Chiyaan Vikram & AR Rahman's 'Cobra' to hit the screens on this date? - Hot buzz - Tamil News - IndiaGlitz.com

ఇక నటుడు విక్రమ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. విక్రమ్ మాట్లాడుతూ..” దర్శకుడు అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ సినిమాని ఎంతో విభిన్న వైవిధ్యభరితంగా తీశాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుందో ప్రస్తుతం ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిజీగా ఉన్నారు. అందువల్లే ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక విక్రమ్‌ అభిమానుల గురించి మాట్లాడుతూ ..”తన సినిమా ధియేటర్లకు వచ్చి మూడు సంవత్సరాలు అయ్యింది. ఇంత ఆలస్యంగా సినిమా వస్తున్నప్పటికీ మీరందరూ నాపై చూపిస్తున్న ప్రేమకు నేను దాసుడిని “అంటూ విక్రమ్‌ ఎమోషనల్ గా అభిమానులు గురించి మాట్లాడాడు. ఇక ఈ సినిమాని 7 స్క్రీన్ పతాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Vikram's Cobra to release in three languages Tamil Movie, Music Reviews and News

Share post:

Latest