నాగార్జున ఆస్తులు, రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?.. అలా చేసిన ప్రపంచంలోనే ఏకైక హీరోగా..

కింగ్ నాగార్జున పరిచయం అక్కర్లేని పేరు.. నాగేశ్వరరావు వారసుడిగా మూవీస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన సొంత టాలెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులోనే కాదు, హిందీ సినిమాల్లోనూ రాణించారు. నాగార్జున నటుడిగానే కాదు.. నిర్మాత, టీవీ హోస్ట్, వ్యాపారవేత్త కూడా.. సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు.. ఈరోజు అక్కినేని నాగార్జున 62వ పుట్టినరోజు.. ఈ సందర్భంగా మన టాలీవుడ్ కింగ్ ఎంత బిజినెస్ చేస్తున్నారు? సినిమాలే కాకుండా ఎక్కడి నుంచి ఎంత సంపాదిస్తున్నారు? ఆయన ఆస్తులు ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటీ:

అక్కినేని నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కిన ‘వెలుగు నీడలు’, ఆ తర్వాత ‘సుడిగుండాలు’తో బాల నటుడిగా మారారు. 1986లో ‘విక్రమ్’ సినిమాతో నాగార్జున హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి నాగార్జునను స్టార్ ని చేసింది. ఆ తర్వాత ‘శివ’, ‘గీతాంజలి’, ‘విక్కీ దాదా’, శివమణి, అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి, మన్మధుడు, మాస్, డాన్, కింగ్ వంటి ఎన్నో హిట్ చిత్రాలు నటించి స్టార్ హీరోగా ఎదిగారు. అంతే కాదు కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. తన 36 ఏళ్ల కెరీర్ లో 40 మంది కొత్త దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశారు.

నిర్మాతగా సత్తా:

అక్కినేని నాగార్జున నిర్మాత కూడా.. అన్నపూర్ణ స్టూడియో పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థను కూడా కలిగి ఉన్నారు. కింగ్ నాగార్జున తన ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలను నిర్మించి హిట్ కొట్టారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఇప్పటికీ తన ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాలు తీస్తున్నారు.

బుల్లితెరపై కూడా కింగే:

కింగ్ అక్కినేని నాగార్జున సినిమాల్లోనే కాదు.. బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించిన ఆయన.. అందులో తన మాటలతో అదరగొట్టాడు. ఆ తర్వాత వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ సో ‘బిగ్ బాస్’కు హోస్ట్ గా చేశారు. దీంతో కింగ్ నాగ్ ఏకంగా నేషనల్ వైడ్ గా రికార్డు క్రియేట్ చేశారు.

వ్యాపారంలో రాణిస్తూ:

కింగ్ నాగార్జున వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. నాగార్జున ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్స్ జట్టుకు యజమానిగా ఉన్నారు. దీంతో పాటు మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి మహి రేసింగ్ టీమ్ ఇండియాలో పెట్టుబడి పెట్టారు. ఇది మాత్రమే కాదు.. కేరళ బ్లాస్ట్ ఫుట్ బాల్ క్లబ్, ఇండియా సూపర్ లీగ్ క్లబ్ కు సహ యజమాని కూడా. అనేక మోటార్ స్పోర్ట్స్ దుస్తులను తయారు చేసే వ్యాపారంలో నాగార్జున భాగస్వామి.. అంతేకాదు.. నాగార్జునకు చాలా రెస్టారెంట్లు ఉన్నాయి.

ప్రపంచంలోనే ఏకైకా హీరోగా రికార్డు:

కింగ్ నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నో మరిచిపోలేని సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఈక్రమంలో ఆయన కొన్నేళ్ల క్రితం ‘మనం’ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగేశ్వరరావు, నాగచైతన్య, సమంత, అమలు, అఖిల్ నటించారు. ఇలా ఫ్యామిలీ మొత్తంతో సినిమా చేసిన ప్రపంచంలోనే ఏకైక హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు.

నాగార్జున ఆస్తులు:

అక్కినేని నాగార్జున ఆస్తులు రూ.1200 కోట్లు ఉంటుందని సమాచారం.. ఆయనకు దాదాపు రూ.100 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా చాలా ఉన్నాయట.. ఆయన కార్లు, ఇల్లు మిగితా యాక్ససిరీస్ విలువ రూ.200 నుంచి రూ.300 కోట్లు ఉంటుందని టాక్. నాగార్జున ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వీటితో పలు ఆదాయ మార్గాల ద్వారా ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారట.