ఎన్టీఆర్ కుటుంబానికి శ్రావణమాసం శాపంగా మారిందా.. ఎంతమంది చనిపోయారంటే..?

హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసం అత్యంత పవిత్రమైనది .ఇక ఈ క్రమంలోనే శ్రావణమాసంలో ఎక్కడ చూసినా దేవతలు విశేష పూజలు అందుకుంటారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు అనువైన సమయంగా చెప్పబడే శ్రావణమాసం స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబానికి మాత్రం శాపంగా మారిపోయింది. ఇక ఎందుకిలా అనాల్సి వచ్చింది అంటే నిన్న మరణించిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరుని మొదలుకొని ఇప్పటికే ఎంతోమంది శ్రావణమాసంలోనే మరణించడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి శ్రావణమాసంలోనే మరణించిన వారి గురించి మనం చదివి తెలుసుకుందాం..

రామకృష్ణ:
ఎన్టీఆర్ బసవతారకం కు మొత్తం 12 మంది సంతానం. అయితే వారిలో సీనియర్ రామకృష్ణ చాలా చిన్న వయసులోని అరుదైన మసూచి వ్యాధితో కన్నుమూశారు. ఇక రామకృష్ణ మరణించేటప్పుడు ఆయన వయసుకు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఇక రామకృష్ణ పై ఎన్టీఆర్కు ఎనలేని ప్రేమానురాగాలు ఉండేవట. ఇక రామకృష్ణ చనిపోయిన వెంటనే ఆయన జ్ఞాపకాలతో చాలా కాలం పాటు ఎన్టీఆర్ మళ్ళీ మామూలు మనిషి కాలేదు అని, ఇక ఆ తర్వాత పుట్టిన కొడుకుకు కూడా జూనియర్ రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారట ఎన్టీఆర్. ఇక ఈయన కూడా శ్రావణ మాస నెలలోనే మరణించడం గమనార్హం.

సాయి కృష్ణ:
ఎన్టీఆర్ ఐదవ సంతానమైన సాయి కృష్ణ 2004వ సంవత్సరంలో ఇలా శ్రావణమాసంలోనే అనారోగ్య కారణంగా కన్నుమూశారు.

హరికృష్ణ:ఎన్టీఆర్ కుటుంబంలో ఆ విషాదం జరిగి రెండేళ్లు..! | nanamuri family reminds  harikrishna on his second death anniversaryఎన్టీఆర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హరికృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన చేసింది కొన్ని సినిమాలైనా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి. ఇక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్కును చాటుకున్నాడు. కానీ 2018 ఆగస్టు 29వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఉమా మహేశ్వరి:NTR's Daughter Uma Maheswari Passes Away! - Movie Newsఇక ఈమె కూడా ఎన్టీఆర్ నలుగురు కూతుర్లలో చివరి కూతురు కావడం గమనార్హం . మానసికక్షోభ కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా నిన్న తన ఇంటిలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇలా వీరందరూ ఒకే నెలలో మరణించడం గమనార్హం.

Share post:

Latest