ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త.. మారుతి సినిమా విశేషాలు బయటికొచ్చాయి!

బాహుబలి అనే సినిమాతో ప్రభాస్ జీవితమే మారిపోయింది. డార్లింగ్ ఫాన్స్ అని చెప్పుకొనే వారి సంఖ్య అక్కడినుండి నాలుగింతలు పెరిగింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్‌గా ఉన్న ప్రభాస్‌ బాహుబలితో ఇంటర్నేషనల్‌ హీరోగా మారి, బాలీవుడ్ ఖాన్లకు సైతం షాక్ ఇచ్చాడు. ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు అది ఇండియా వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ న్యూస్ గా మారే పరిస్థితి వచ్చింది. బాహుబలి తర్వాత సాహో, రాదేశ్యామ్‌ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు.

ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌, ఓం రౌత్‌తో ఆదిపురుష్‌, సందీప్‌ వంగతో స్పిరిట్‌.. సినిమాలను లైన్లో పెట్టిన డార్లింగ్ తాజాగా మారుతి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. మొదట్లో ప్రభాస్‌-మారుతి సినిమాపై వచ్చిన వార్తలను ఎవ్వరూ నమ్మలేదు. ఈ క్రమంలో డార్లింగ్ అభిమానులు ఆ వార్త నిజం కాకపోతే బావుండును అని అనుకున్నారు. కానీ వీరి కాంబినేషన్‌ కాన్ఫామ్‌ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా హారర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కించనున్నట్లు సమాచారాం. ప్రభాస్‌ కెరీర్‌లోనే ఇలాంటి నేపథ్యంలో వస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఇందులో డార్లింగ్‌ జోడిగా ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించనున్నారనది మరో వార్త. అలాగే ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ దెయ్యం పాత్రలో నటించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే సినిమాకు సంబంధించి అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Share post:

Latest