బాలయ్య ‘అన్‌స్టాప‌బుల్‌’ సీజన్ 2 షో డేట్ వచ్చేస్తుందోచ్..ఆ స్పెషల్ రోజే స్టార్ట్..!?

అభిమానులను సాటిస్ఫై చేయాలన్న.. వాళ్ళ ఆకలి తీర్చాలన్న నందమూరి బాలకృష్ణ గారి తర్వాతే ఎవరైనా. ఉన్నది ఉన్నట్లే ఫేస్ మీద మాట్లాడే తత్త్వం ఉన్న నందమూరి బాలకృష్ణ.. అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే . ఆయన స్టైల్ ..ఆయన యాటిట్యూడ్.. ఆయన మాట తీరు.. ఆయన మంచితనం.. ఆయన కోపం.. మిగతా హీరోలకి ఉండదు . మంచి పని చేస్తే చప్పట్లు కొట్టే ఆ చేతులే.. చెడ్డ పని చేస్తే చంప పగలకొట్టే వరకు వస్తాయి. ఆ ధైర్యం అందరూ హీరోలకి రాదు. అది నందమూరి బాలకృష్ణ కే సొంతం.

నందమూరి హీరో బాలకృష్ణ ఇప్పుడు హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. ఎవ్వరు ఊహించిన విధంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. నందమూరి బాలకృష్ణను హోస్టుగా పరిచయం చేయడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అన్ స్టాపబుల్ విత్ NBK అంటూ ఓ సరి కొత్త టాక్ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ షోకి వచ్చిన గెస్ట్ లతో ఆయన ఆట ఆడించిన తీరు.. ఆయన పలకరించిన విధానం.. ఆయన నవ్వించిన పద్ధతి.. జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు తనకు మిగతా హీరోలకు ఏదో గొడవ ఉందంటూ సో కాల్డ్ గాసిప్స్ వచ్చినా కూడా మా మధ్య ఏమీ లేదంటూ పటాపంచలు చేసిన తీరు జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరి కళ్ళు రెండో సీజన్ పై పడ్డాయి.


నిజం చెప్పాలంటే ఆయన నటించే సినిమాలు కన్నా ఎప్పుడెప్పుడు ఈ షో సీజన్ 2 స్టార్ట్ అవుతుందా అని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. బాలయ్య సరదా మాటలు.. చిలిపి అల్లరి.. ఫన్నీ డైలాగ్స్ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్ని మిస్ అవుతున్నారు. అయితే అలాంటి వాళ్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ హౌస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ స్టాప్ షో కొత్త సీజన్ ని టెలికాస్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఆహా .

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ను విజయదశమి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య లైఫ్ లో విజయదశమి అంత స్పెషల్ అనేది మనకు తెలిసిందే. ఈరోజునే ఎన్నో సినిమాలు రిలీజ్ అయి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. మరి అలాంటి స్పెషల్ డే నాడు బాలయ్య అన్ స్టాపబుల్ షో 2 ని స్టార్ట్ చేస్తే మామూలుగా ఉండదు. సీజన్ 1 లో మహేష్ ,అల్లు అర్జున్, మోహన్ బాబు, రాజమౌళి ,కీరవాణి ,రానా దగ్గుబాటి ,రష్మిక మందన, రవితేజ లాంటి ఎంతోమంది స్టార్స్ వచ్చి సందడి చేశారు. కాగా ఇప్పుడు సీజన్ 2 లో అంతకుమించిన ఎనర్జిటిక్ హీరోస్ రాబోతున్నారని సమాచారం . ముఖ్యంగా బాలకృష్ణతో.. చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి బిగ్ స్టార్స్ సందడి చేయబోతున్నారని సమాచారం. దీంతో నెట్టింట బాలకృష్ణ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.