అదేంటి నాగ్‌ VS చిరు ఏం జ‌రిగింది… ఎక్క‌డ తేడా కొట్టింది…!

సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగలా ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వ‌స్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వెంకటేష్- నాగార్జున ఫ్యామిలీ సినిమాలు… ప్రేమ కథలు చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు.

Chiru, What's Your Position Now? | Chiranjeevi | Nagarjuna | Venkatesh

వీరిలో చిరంజీవి- నాగార్జున బంధం మాత్రం ప్రత్యేకమైనది. వీరిద్దరి మధ్య మంచి స్నేహ సంబంధమే ఉంది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య బాక్సాఫీస్ వేదిక‌గా ఇంట్ర‌స్టింగ్ వార్ జ‌ర‌గ‌నుంది. ఈ ఇద్దరి సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చిరంజీవి గాడ్‌ఫాథ‌ర్ అక్టోబర్ 5 న‌ విడుదలవుతుంది. అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ విడుదల కానుంది. అయితే ఘోస్ట్ రిలీజ్ డేట్ ముందే ప్ర‌క‌టించినా.. త‌ర్వాత చిరు సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో పోటీ త‌ప్ప‌డం లేదు.

Star kids who made a mark in the Telugu film industry

నాగ్ సినిమా డేట్ ముందు ప్ర‌క‌టించాక అదే రోజు చిరు సినిమా వేయ‌డం కొంద‌రికి న‌చ్చ‌లేదు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం సినిమాలో ద‌మ్ము ఉంటే రెండు సినిమాల‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని.. లేక‌పోతే వీక్ సినిమా మాత్రం తేలిపోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఏదేమైనా ద‌స‌రా సెల‌వులు ఉండ‌డంతో వీటిని క్యాష్ చేసుకునేందుకు రెండు సినిమాలు ఒకేసారి వ‌స్తున్నాయి. మ‌రి ఈ ఇద్ద‌రు హీరోల్లో ఎవ‌రైనా వెన‌క్కు త‌గ్గుతారా ? లేదా ? అన్న‌ది చూడాలి.