మోదీతో బాబు…సెట్ అయినట్లేనా?

2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు..బీజేపీకి దగ్గరవ్వాలనే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకు బాబు ఒక ధోరణిలో ముందుకెళ్లగా…ఎన్నికల తర్వాత మరొక వర్షన్..అసలు ఎన్నికల ముందు చంద్రబాబు…కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఏ స్థాయిలో పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కేంద్రం సాయం అందించడం లేదని చెప్పి…బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి..ప్రత్యేక హోదాపై పోరాటం చేశారు. అలాగే మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు.

ఢిల్లీ స్థాయిలో ధర్మపోరాట దీక్షలు పెట్టి హడావిడి చేశారు..అలాగే కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి..కాంగ్రెస్ తో సహ విపక్ష పార్టీలతో జట్టు కట్టి..ఏదో చేసేద్దామని అనుకున్నారు. కానీ చివరికి ఏమి చేయలేకపోయారు…అటు కేంద్రంలో మోదీ సర్కార్ మళ్ళీ అధికారంలోకి రాగా, ఇటు ఏపీలో చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇక అక్కడ నుంచి బీజేపీని కలవడం కోసం బాబు చేయని ప్రయత్నాలు లేవు…అనేక రకాలుగా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ బీజేపీ మాత్రం…బాబుని ఏ దగ్గరకు రానివ్వలేదు.

కానీ ఇటీవల బీజేపీ వైఖరిలో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది..బాబుకు దగ్గరయ్యేందుకు బీజేపీ కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగో కేంద్రం సపోర్ట్ బాబుకు కావాలి..ఇక ఏపీలో నాలుగైదు సీట్లు గెలవాలంటే….బీజేపీకి…టీడీపీ మద్ధతు కావాలి. ఈ సమీకరణాల నేపథ్యంలో బాబుకు బీజేపీ దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సమావేశంలో కేంద్ర ఆహ్వానం మేరకు చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఇదే క్రమంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో…మోదీతో పాటు అమిత్ షా…ఇతర కేంద్ర మంత్రులని బాబు కలిశారు. అలాగే వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఇంకా పలువురు ప్రముఖులని కూడా కలిశారు. అదేవిధంగా బాబుతో త్వరలోనే మోదీ సమావేశమవుతారని తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ మద్ధతు బాబుకు దొరికేలా ఉంది…పాత స్నేహం మళ్ళీ చిగురించేలా ఉంది.