ఆ రూల్‌కు బాబు బ్రేక్?

రాజకీయాల్లో ఎవరికైనా ప్రధాన లక్ష్యం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం…అందుకోసం నేతలు ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తారు…ఆ వ్యూహాలు సక్సెస్ అయితే ఇబ్బంది లేదు…కానీ కొన్ని సార్లు ఫెయిల్ కూడా అవ్వొచ్చు..గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలన్న బాబు ఆశలు నెరవేరలేదు. జగన్ వ్యూహాలు ముందు బాబు నిలబడలేకపోయారు.

బాబు వేసిన వ్యూహాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి…టీడీపీ అధికారానికి దూరమైంది. అయితే ఈ సారి అలా చేయకూడదని బాబు భావిస్తున్నారు…గత ఎన్నికల్లో అమలు చేసిన కొన్ని వ్యూహాలని మళ్ళీ అమలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లో బాబు అమలు చేసిన వ్యూహాల్లో ఒకటి…ఎమ్మెల్యే స్థానాల్లో బలంగా ఉన్న అభ్యర్ధులని కొందరిని ఎంపీ స్థానాల్లో నిలబెట్టారు. దీని వల్ల పార్టీకి నష్టమే జరిగింది..అటు ఎమ్మెల్యే స్థానాల్లో ఓడిపోయారు…ఇటు ఎంపీ స్థానాల్లో ఓడిపోయారు.

ఉదాహరణకు కావలిలో బలంగా ఉన్న బీదా మస్తాన్ రావుని…నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు…దీని వల్ల అటు కావలి, ఇటు నెల్లూరులో టీడీపీ ఓడిపోయింది. ఇలా కొన్ని చోట్ల అభ్యర్ధులని మార్చారు. ఈ సారి మాత్రం ఇలాంటి ప్రయోగం చేయకూడదని బాబు ఫిక్స్ అయ్యారు. అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉన్న అభ్యర్ధులని పార్లమెంట్ స్థానాల్లో పోటీకి దింపడానికి సిద్ధంగా లేరు.

ఇక గత ఎన్నికల్లో ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఈ కాన్సెప్ట్ కొంతవరకు మంచిదే…ఇంకా ఎక్కువ మంది నేతలకు సీట్లు దక్కుతాయి. కానీ గత ఎన్నికల్లో ఈ వ్యూహం ఫెయిల్ అయింది…అందుకే ఈ సారి ఇలాంటి రూల్ పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో బలమైన నేతలు ఉంటారు. ఉదాహరణకు పరిటాల ఫ్యామిలీ. సునీతమ్మ, శ్రీరామ్ లు ఉన్నారు…వీరికి రెండుసీట్లు ఇస్తే పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. మరి చూడాలి ఈ సారి బాబు ఎలాంటి రూల్స్ తో ముందుకొస్తారో.

Share post:

Latest