రెమ్యూరేషన్ విషయంలో ప్రభాస్ ను దాటేసిన బన్నీ.. ఎన్ని కోట్లు అంటే..?

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాగా పాపులారిటీ సంపాదించారు. పుష్ప -2 సినిమా కోసం అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి 350 కోట్ల రూపాయలు బడ్జెట్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఇందులో నటీనటులకు ఇవ్వనున్న పారితోషికం మొత్తం గురించి కూడా బాగా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు వినిపించాయి.Allu Arjun on Twitter: "Many Many Happy Returns Of The Day To My Dearest Darling Prabhas . The Love & Affection I feel for him has been the same from beginning .

అయితే తాజాగా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెమ్యూనరేషన్ తోనే అల్లు అర్జున్ నెంబర్ వన్ అయిపోయారని సమాచారం. అయితే ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిలోనూ సందేహంగా మారుతోంది.. అయితే గతంలో అయితే ప్రభాస్ అని చెబుతూ ఉండేవారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇక ప్రభాస్ ఒక్కో చిత్రానికి గాను రూ.100 కోట్లు పైనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇప్పటివరకు ఇలాంటి రెమ్యూనరేషన్ ఏ హీరో కూడా తెలుగులో అందుకోలేదు.

అయితే ఆది పురుష్ సినిమా కోసం దాదాపుగా రూ.120 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఇదే విషయంలో అల్లు అర్జున్ బీట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప -2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.128 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ వాటా రూ. 75 కోట్లు.. ప్రొడక్షన్ కాస్ట్ రూ.150 కోట్లు అన్నట్లుగా ప్రచారంలో ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మొదటి పార్ట్ కి రెండవ పార్ట్ కి ఒకేసారి అంత రెమ్యునరేషన్ పెంచేయడం తో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.