రష్మికకి షాకిచ్చిన బాలీవుడ్‌… అక్కడ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమయ్యుంటుంది?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరన్నా వున్నారు అంటే అది రష్మికనే. ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత అమ్మడు తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తోంది. ఇలా వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న రష్మిక మందన.. రీసెంట్ గా సీతారామం సినిమా చేసి మరోసారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాగా రిలీజైన పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటించి ఏకంగా బాలీవుడ్ జనాలను సైతం ఆకర్శించింది. ఇప్పుడు తాజాగా సీతారామం సినిమాలో ఓ ముస్లిమ్ యువతిగా నటించి మంచి మార్కులు పట్టేసింది. ఈ చిత్రంలో అఫ్రిన్ గా కనిపించిన రష్మిక పాత్రకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో కూడా రష్మికకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక సినిమా అక్కడ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అని తెలుస్తోంది.

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టైగర్ ష్రాఫ్ ఇప్పటికే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో కరణ్ జొహార్ నిర్మిస్తున్న ‘స్క్రూ ఢీలా’ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. ‘స్క్రూ ఢీలా’ చిత్రాన్ని రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని చేసేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పై టైగర్ ష్రాఫ్ సంతకం చేశాడు. అయితే, పారితోషికాన్ని తగ్గించుకోవాలని.. లాభాల్లో వాటా తీసుకోవాలని టైగర్ ను కరణ్ జొహార్ కోరారట. ఈ డీల్ సరిగ్గా కుదరకపోవడంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం బిటౌన్లో జరుగుతుంది. ఇంకొన్నాళ్ళు ఆగితేగాని అసలు విషయం అనేది బయటకి రాదు.

Share post:

Latest