జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరనున్నారా??

జూ.ఎన్టీఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటన కి గాను చాలా ప్రసంశలు అందుకున్నారు ..అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు..

ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని అమిత షాతో డిన్నర్ కి ఆహ్వానించారు..RRR లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అమిత్ షా జూ.ఎన్టీఆర్ ని ప్రశంసించారు. తెలుగు జాతి తారకరత్నం జూ.ఎన్టీఆర్ అని కొనియాడారు.. జూ. ఎన్టీఆర్ కి టీడీపీ తో నేరుగా సంబంధం వున్నా రాజకీయాలలో యాక్టీవ్ గా లేరు. 2009 నుండి జూ.ఎన్టీఆర్ టీడీపీ లీడర్స్ తో కానీ ఇతర పార్టీ లీడర్స్ తో కానీ పబ్లిక్ లో కనిపించటం లేదు ..

ప్రస్థుతం ఆయన దృష్టంతా సినిమాల పైనే పెట్టారు..అయితే రాజకీయ నిపుణులు మాత్రమే ఈ బేటి సాధరణ బేటీ లా చూడటం లేదు. జూ.ఎన్టీఆర్ మేనత్త పురంధరేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ ని బీజేపీ లో కి చేర్చటానికి వేసిన వ్యూహంలా అనుకుంటున్నారు. మరి జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక తీరుస్తారా??