ప్లాస్టిక్ పాలిటిక్స్…పవన్ కోసమేనా?

ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి చాలా హానికరం…ప్లాస్టిక్ వల్ల మనవాళికి చాలా నష్టం కూడా ఉంది…అందుకే ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకెళుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించింది. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్లీలను నిషేధిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ స్ఫూర్తిగా 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని చెప్పుకొచ్చారు.

అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేది…దీన్ని అందరూ పాటిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఏదైనా కార్యక్రమం జరిగితే చాలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కట్టేది వైసీపీ నేతలే. తాజాగా పెడన నియోజకవర్గంలో నేతన్న నేస్తం కార్యక్రమం జరిగింది..అక్కడ జగన్‌కు స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. ఏ స్థాయిలో ఫ్లెక్సీలు కట్టారంటే…ఆ ఫ్లెక్సీల డబ్బులతో ఒక వూరుకు రోడ్డు వేయించ వచ్చు.

కేవలం వైసీపీ మాత్రమే కాదు టీడీపీ కూడా పెద్ద స్థాయిలో ఫ్లెక్సీలు కడుతుంది…తాజాగా బాబు కుప్పం టూర్ వెళ్ళగా, అక్కడ తెలుగు తమ్ముళ్ళు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడే వైసీపీ-టీడీపీ నేతలు ఫ్లెక్సీలు చింపుకుని గొడవపడ్డారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఫ్లెక్సీలు కడుతుంది..ఒక ఛోటా మోటా నేత పర్యటనకు సైతం ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు…అలాగే ఇంకా సినిమా రిలీజ్ లకు, ఇతర వేడుకలు ఉన్న ఫ్లెక్సీలు కడుతున్నారు.

అయితే  ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధించడం మంచి విషయమే…కానీ ఇదే సమయంలో జనసేన శ్రేణులు సరికొత్త వాదన తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ అని జగన్ చెబుతున్నారని మండిపడుతున్నారు. ఇక ప్లాస్టిక్ బ్యాన్ మంచి విషయమే అని, మరి దీన్ని అధికార వైసీపీ నేతలు ఎంత బాగా పాటిస్తారో చూస్తామని అంటున్నారు. మరి చూడాలి ఈ ప్లాస్టిక్ బ్యాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.