అనిల్ పై కుట్ర..ఆ వైసీపీ ఎమెల్యే ఎవరు?

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు మరింత ఎక్కువైపోతుంది..సొంత పార్టీ వాళ్లపైనే కుట్రలు చేసి…వారిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య రచ్చ జరుగుతుంది…కొన్ని సందర్భాల్లో నాయకులు బయటకొచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అధిష్టానం సర్దిచెప్పడంతో కొందరు నేతలు సైలెంట్ గా ఉంటున్నారు…కానీ కొందరు ఇంకా ఆధిపత్య పోరుతో పార్టీని దెబ్బతీస్తున్నారు.

ఇక ఈ రచ్చ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది..జిల్లా మొత్తం వైసీపీ కంట్రోల్ లోనే ఉంది…అందుకే అనుకుంటా సొంత నేతలే కుట్ర చేస్తూ…తమ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ పార్టీ వారు కుట్ర చేసి తనని దెబ్బకొట్టాలని చూస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే బాటలో తాజాగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీకి చెందిన ఓ నేత…టీడీపీ నేతలకు డబ్బులు ఇచ్చి తనని తిట్టిస్తున్నారని, తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తనని బలహీన పరిచేందుకు కుట్ర పన్నారని అనిల్ అంటున్నారు. ఓ టీడీపీ నేత..తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో టచ్ లో ఉంటూ…రోజుకు పదివేలు తీసుకుంటూ తనని తిడుతున్నారని, వారి చరిత్ర తన దగ్గర ఉందని, త్వరలోనే ఆధారాలతో సహ వారి బండారం బయటపెడతానని అనిల్ చెప్పుకొచ్చారు.

అంటే అనిల్ ఆరోపణలు బట్టి చూస్తుంటే వైసీపీలోని కొందరు…టీడీపీ నేతలకు డబ్బులిచ్చి మరీ అనిల్ ని తిట్టిస్తున్నారు. అయితే అనిల్ కు వ్యతిరేకంగా నెల్లూరు లో పనిచేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద చర్చ అయింది. నెల్లూరులో కొంతమంది సీనియర్లతో అనిల్ కుమార్ కు పడదనే సంగతి తెలిసిందే. మొదట నుంచి వారితో విభేదాలు ఉన్నాయి. మొత్తానికైతే నెల్లూరు వైసీపీలో పెద్ద రచ్చ నడుస్తోంది.