అల్లువారి అబ్బాయి రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని సూపర్ డూపర్ హిట్లో తెలుసా?

అల్లువారి అబ్బాయి అనగానే గుర్తొచ్చేది ఒకే ఒక్కడు. అతనే అల్లు అర్జున్. అవును… అల్లు వారి కుటుంబంలో ముగ్గురు వారసులు ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి ఠక్కున గుర్తొచ్చేది మాత్రం బన్నీనే. దానికి గల కారణాలు వేరే చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదటినుండి చాలా సెలెక్టివ్ గా కధలను ఎంచుకుంటూ తనకంటూ ఓ మార్క్ ని ఏర్పాటుచేసుకున్నాడు అల్లు అర్జున్. అవును… అతని మొదటి సినిమా గంగోత్రికి, నిన్న మొన్న రిలీజైన ‘పుష్ప’ సినిమాకి మధ్యగల వ్యత్యాసాన్ని గమనిస్తే చాలా ఈజీగా తెలుస్తోంది. అతనిలో నటనా పటిమ రోజురోజుకీ పెరిగిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఒక్క తెలుగునాట కాకుండా మలయాళంలో కూడా అక్కడి పెద్ద హీరోలతో సమానంగా క్రేజ్ వున్న ఏకైన తెలుగు నటుడు బన్నీనే. తాను చేసిన సినిమాలకు అక్కడ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే మొదటి నుండి ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించిన బన్నీ మధ్యమధ్యలో కొన్ని సినిమాలు నచ్చకో, లేదా డేట్స్ కుదరకో వదిలేసిన ఘటనలు వున్నాయి. అందులో ఇపుడు సూపర్ డూపర్ హిట్లయినటువంటి సినిమాలను గురించి తెలుసుకుందాం. ‘జయం’ సినిమా ముందు బన్నీతోనే చేయాలి, కానీ అరవింద్ దానిని వద్దనడంతో చేయలేదు బన్నీ. ఆ సినిమా నితిన్ కెరీర్ కి ఉపయోగపడింది.

భద్ర సినిమాని కొన్ని అనివార్యకారణాలన వదిలేశారు అల్లు అర్జున్. ఆ సినిమా సంగతి మీకు తెలిసిందే. అలాగే 100 % లవ్ సినిమా కథ ముందు బన్నీకి చెప్పాడట సుకుమార్. కానీ మనోడు ఎందుకో చేయలేదు. విషయం తెలిసినదే. అర్జున్ రెడ్డి సినిమా మొదట అల్లు అర్జున్ కి చెప్పాడు సందీప్. అయితే అలాంటి కథ చేయడానికి బన్నీ ధైర్యం చేయలేకపోయాడు. ఇదే సినిమాతో ఈరోజు విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇంకా ఆ లిస్టు పెద్దగానే ఉంటుంది గానీ, కొన్ని ప్లాపులు కూడా వున్నాయి. అయితే ఈ సినిమాలు చేసుంటే బన్నీ రేంజ్ ఇంకోలాగా ఉండేదేమో!

Share post:

Latest