శివాజీ సర్వే..పులివెందులలో కష్టపడాలట!

ఏపీ రాజకీయాల్లో నటుడు శివాజీ ఎప్పుడు ఏదొక విచిత్రమైన అంశాన్నే తెరపైకి తెస్తూ ఉంటారు..అసలు ఈయన రాజకీయం ఎవరి కోసం అనేది క్లారిటీ ఉండదు. కొన్ని రోజులు టీవీ డిబేట్లలో కనిపించి హడావిడి చేస్తారు…మళ్ళీ తర్వాత అడ్రెస్ లేకుండా వెళ్లిపోతారు. కమ్మ వర్గానికి చెందిన శివాజీ…పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి..ఏదొకరకంగా టీడీపీని మళ్ళీ గెలిపించడానికి మాట్లాడుతూనే ఉన్నారు.

ఇలా పరోక్షంగా టీడీపీ కోసం పనిచేస్తున్న శివాజీ…తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహాసేన రాజేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ సభలో పాల్గొన్న శివాజీ…ఈ సారి నిజాయితీ గల నాయకుడుని ఎన్నుకోవాలని మాట్లాడారు. అలాగే పొత్తులు పెట్టుకుంటారో ఏం చేస్తారో తెలియదు…నెక్స్ట్ జగన్ అధికారం నుంచి దిగిపోవలనే విధంగా కామెంట్ చేశారు. ఇదే సమయంలో తాను కూడా ఓ సర్వే చేయిస్తున్నానని చెప్పుకొచ్చారు.

అయితే ఆ సర్వే పూర్తి అవ్వగానే మీడియాకు ఇస్తానని…దసరా తర్వాత ఆ సర్వే వివరాలని బయటపెడతానని శివాజీ అంటున్నారు. ప్రస్తుతానికి ఓ 42  నియోజకవర్గాల్లో సర్వే చేయించామని…ఆ 42 స్థానాల్లో వైసీపీ గెలుపు అవకాశాలు లేవని చెప్పుకొచ్చారు. అలాగే పులివెందులలో ఈ సారి జగన్ గెలవడానికి కష్టపడాలని, బాగా కష్టపడితే ఓ 2 లేదా 3 వేల ఓట్లతో గెలిచి బయటపడతారని అన్నారు. మామూలుగా సర్వే అంటే పూర్తిగా నమ్మడానికి లేదు. పైగా 42 స్థానాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు లేవన్నప్పుడే…ఇది ఎలాంటి సర్వే అనేది అర్ధమవుతుంది.

ఇక జగన్ మెజారిటీ 2 వేలు అంటే…నమ్మడానికి ఏ మాత్రం వీలు లేకుండా ఉంది. గత ఎన్నికల్లోనే 90 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు…ఈ సారి కాస్త తగ్గిన సరే…దాదాపు 70 వేల పైనే మెజారిటీ ఉంటుంది..అలాంటిది శివాజీ సర్వే మరీ ఫేక్ గా ఉంది. గతంలో ఆపరేషన్ గరుడ లాంటిదే ఈ సర్వే అనుకుంటా.